
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 సీజన్ తమ తొలి మ్యాచ్‌లో సంచలన విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెండో మ్యాచ్‌లో మార్చి 30న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ జట్టుకు అదిరిపోయే వార్త అందింది.
తొలి మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఆడనున్నాడు. రాహుల్ ఇప్పటికే ఢిల్లీ జట్టుతో కలిశాడు. కాగా ఇటీవలే రాహుల్ భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు రాహుల్ దూరమయ్యాడు.
రాహుల్ లేనిప్పటికి ఢిల్లీ బ్యాటర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ చేధించింది. ఇప్పుడు రాహుల్ కూడా అందుబాటులోకి రావడంతో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారనుంది.
ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.14 కోట్ల భారీ ధరకు రాహుల్‌ను ఢిల్లీ కొనుగోలు చేసింది. రాహుల్ గత మూడు సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు సారథ్యం వహించాడు. అయితే ఫ్రాంచైజీ యాజమాన్యంతో విభేదాల వల్ల రాహుల్ బయటకు వచ్చేశాడు. ఈ క్రమంలో ఢిల్లీ గూటికి రాహుల్ చేరాడు. రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌లో 132 మ్యాచ్‌లు ఆడి 4683 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు ఉన్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు
ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మణిమారన్ సిద్ధార్థ్ బెంచ్: అబ్దుల్ సింగ్, సమద్, అక్‌గర్‌రాజ్, హిమ్మత్ కులకర్ణి, షమర్ జోసెఫ్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, మాథ్యూ బ్రీట్జ్కే, ఆర్యన్ జుయల్, యువరాజ్ చౌదరి, మయాంక్ యాదవ్