ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ లైవ్ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024 RCB vs SRH Live Updates: ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ లైవ్ అప్‌డేట్స్‌

Published Thu, Apr 25 2024 7:37 PM

IPL 2024: Royal Challengers bangalore vs Sun Risers Hyderabad Live Score, Updates And Highlights

IPL 2024 RCB vs SRH Live Updates: 

ఎస్‌ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ఘన విజయం..
ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో షాబాజ్ అహ్మద్(40) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ప్యాట్‌ కమ్మిన్స్‌(31), అభిషేక్‌ శర్మ(31) పర్వాలేదన్పించారు.

ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, కామెరాన్ గ్రీన్,కరణ్‌ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్‌ పాటిదార్‌(50), విరాట్‌ కోహ్లి(51) హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్‌) రాణించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో జయ్‌దేవ్‌ ఉనద్కట్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్‌ రెండు వికెట్లు, ప్యాట్‌ కమ్మిన్స్‌,మార్కండే తలా వికెట్‌ సాధించారు.

ఏడో వికెట్‌ డౌన్‌..
124 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. 31 పరుగులు చేసిన కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌.. గ్రీన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి భువనేశ్వర్‌ కుమార్‌ వచ్చాడు.

కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌..
207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షాబాజ్ అహ్మద్(13), ప్యాట్‌ కమ్మిన్స్‌(3) పరుగులతో ఉన్నారు.

56 పరుగులకే 4 వికెట్లు..
207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్‌ వేసిన స్వప్నిల్ సింగ్ బౌలింగ్‌లో తొలుత మార్‌క్రమ్‌(7) ఔట్‌ కాగా.. తర్వాత క్లాసెన్‌(7) ఔటయ్యారు. 6 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 62/4. క్రీజులో నితీష్‌ కుమార్‌ రెడ్డి(10),షాబాజ్ అహ్మద్(3) ఉన్నారు.

రెండో వికెట్‌ డౌన్‌..
37 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ.. యశ్‌దయాల్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 37/2. క్రీజులో మార్‌క్రమ్‌(3), నితీష్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌
207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ట్రావిస్‌ హెడ్‌.. విల్‌ జాక్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

దంచి కొట్టిన ఆర్సీబీ.. ఎస్‌ఆర్‌హెచ్‌ టార్గెట్‌ 207 పరుగులు
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన ఆర్సీబీ అదరగొట్టింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో రజిత్‌ పాటిదార్‌(50), విరాట్‌ కోహ్లి(51) హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్(37 నాటౌట్‌) రాణించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లలో జయ్‌దేవ్‌ ఉనద్కట్‌ 3 వికెట్లు పడగొట్టగా.. నటరాజన్‌ రెండు వికెట్లు, ప్యాట్‌ కమ్మిన్స్‌,మార్కండే తలా వికెట్‌ సాధించారు.

18 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 179/5

18 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్‌(27), కార్తీక్‌(7) ఉన్నారు.

విరాట్‌ కోహ్లి ఔట్‌..
ఆర్సీబీ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 51 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లి.. జయ్‌దేవ్‌ ఉనద్కట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 142/4

మూడో వికెట్‌ డౌన్‌..
పాటిదార్‌ రూపంలో ఆర్సీబీ మూడో వికెట్‌ కోల్పోయింది. 50 పరుగులు చేసిన పాటిదార్.. ఉనద్కట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 132/3

12 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 126/2
12 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో విరాట్‌ కోహ్లి(46), రజిత్‌ పాటిదార్‌(49) పరుగులతో ఉన్నారు. పాటిదార్‌ దూకుడుగా ఆడుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

రెండో వికెట్‌ డౌన్‌..
విల్‌ జాక్స్‌ రూపంలో ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన విల్‌ జాక్స్‌.. మార్కండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 73/2. క్రీజులో విరాట్‌ కోహ్లి(34), పాటిదార్‌(6) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ..
48 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 25 పరుగులు చేసిన ఫాప్‌ డుప్లెసిస్‌.. నటరాజన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్‌: 49/1. క్రీజులో విరాట్‌ కోహ్లి(23), విల్‌ జాక్స్‌(1) పరుగులతో ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 24 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(9), ఫాప్ డుప్లెసిస్‌(15) ప‌రుగుల‌తో ఉన్నారు.

తొలుత బ్యాటింగ్‌ చేయనున్న ఆర్సీబీ..ఐపీఎల్‌-2024లో భాగంగా హైద‌రాబాద్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రం ఒక మార్పు చేసింది.

తుది జట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, టి నటరాజన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్‌), విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
 

Advertisement
Advertisement