IPl 2023: Sunil Gavaskar On Dhoni, Says There Will Never Be A Captain Like MS Dhoni - Sakshi
Sakshi News home page

MS Dhoni: మామూలు విషయం కాదు.. ధోని లాంటి కెప్టెన్‌ లేడు.. ఇక ముందు రాబోడు: టీమిండియా దిగ్గజం

Apr 17 2023 2:50 PM | Updated on Apr 17 2023 2:58 PM

IPl 2023 Sunil Gavaskar: There Will Never Be A Captain Like MS Dhoni - Sakshi

ధోని (Photo Credit: IPL/CSK)

IPL 2023- RCB Vs CSK- MS Dhoni: టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్‌ ధోనినే అంటూ కితాబులు ఇచ్చాడు. భవిష్యత్తులో కూడా తనలాంటి నాయకుడు మరెవరూ రాబోరంటూ మిస్టర్‌ కూల్‌ను ఆకాశానికెత్తాడు.

ఒకే ఒక్కడు
భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఎంఎస్‌ ధోని.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటికే సీఎస్‌కేను నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. ఇక ఇటీవల(ఏప్రిల్‌ 12న) రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో చెన్నై కెప్టెన్‌గా 200 మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాడు.

తద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఈ అరుదైన రికార్డు సాధించిన ఏకైక సారథిగా 41 ఏళ్ల ధోని నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే రెండింట విజయాలు సాధించింది.

మామూలు విషయం కాదు
ఈ క్రమంలో బెంగళూరు వేదికగా ఆర్సీబీతో సోమవారం తదుపరి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ షోలో మాట్లాడుతూ ధోని గురించి గావస్కర్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘సీఎస్‌కేకు గడ్డు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో తెలుసు. ఎంఎస్‌ ధోని కెప్టెన్సీలో మాత్రమే సీఎస్‌కేకు ఇది సాధ్యపడుతుంది.

మహీ డిఫరెంట్‌
200 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు. అన్నేసి మ్యాచ్‌లకు సారథ్యం వహించడం అంటే మోయలేని భారాన్ని నెత్తినవేసుకున్నట్లే. అది వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సాధారణంగా అందరు ఆటగాళ్ల విషయంలో జరిగేది ఇది. అయితే, మహీ అందరికీ భిన్నం.

అతడు ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన కెప్టెన్‌. తనలాంటి కెప్టెన్లు ఐపీఎల్‌లో ఇంత వరకు ఎవరూ లేరు. ఇక ముందు రాబోరు కూడా! అతడు అత్యుత్తమ కెప్టెన్‌’’ అని ఈ టీమిండియా మాజీ సారథి.. ధోని నైపుణ్యాలను ప్రశంసించాడు. కాగా సీఎస్‌కే కెప్టెన్‌గా 200 మ్యాచ్‌లు ఆడిన ధోని ఖాతాలో 120 విజయాలు ఉన్నాయి. 79 సార్లు ఓటమి ఎదురుకాగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 

చదవండి: సంజూపై ప్రశంసల వర్షం.. వైరల్‌ ట్వీట్‌! నాకే గనుక ఆ అవకాశం ఉంటే..
అర్జున్‌ చాలా కష్టపడ్డాడు.. సచిన్‌ టెండుల్కర్‌ భావోద్వేగం! వీడియో వైరల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement