IPL 2023: MI Announce Bumrah Replacement, Abhishek Porel Replaces Pant - Sakshi
Sakshi News home page

Bumrah, Rishabh Pant Replacements: బుమ్రా స్థానంలో టీమిండియా పేసర్‌; పంత్‌ రీప్లేస్‌మెంట్‌ అతడే.. ప్రకటన విడుదల

Published Fri, Mar 31 2023 5:18 PM

IPL 2023: MI Announce Bumrah Replacement Abhishek Porel Replaces Pant - Sakshi

IPL 2023- Jasprit Bumrah - Rishabh Pant Replacement: ఐపీఎల్‌-2023 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌ కీలక ప్రకటన చేసింది. గాయం కారణంగా జట్టుకు దూరమైన తమ స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి పేరును శుక్రవారం వెల్లడించింది. తమిళనాడు ఫాస్ట్‌బౌలర్‌ సందీప్‌ వారియర్‌ను బుమ్రా రీప్లేస్‌మెంట్‌గా పేర్కొంది. 

కాగా వెన్నునొప్పి తిరగబెట్టిన కారణంగా బుమ్రా ఐపీఎల్‌ పదహారో ఎడిషన్‌ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో సందీప్‌ వారియర్‌ను తీసుకువచ్చారు. దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు తరఫున ఆడుతున్న సందీప్‌.. ఇప్పటి వరకు ఆడిన 68 టీ20లలో 62 వికెట్లు తీశాడు. గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు ఈ టీమిండియా పేసర్‌.

 ఇక గతేడాది దారుణ వైఫల్యంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. బెంగళూరు వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ముంబై తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

పంత్‌ స్థానంలో అతడు
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ సైతం తమ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ స్థానంలో బెంగాల్‌ ఆటగాడికి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అభిషేక్‌ పోరెల్‌తో పంత్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ కుటుంబంలోకి అభిషేక్‌ పోరెల్‌కు స్వాగతం పలుకుతూ ట్వీట్‌ చేసింది. కాగా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్‌.. ఇప్పటి వరకు 16 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, మూడు లిస్ట్‌ ఏ, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కాగా పంత్‌ దూరమైన నేపథ్యంలో తమ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను ఢిల్లీ ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: WC 2023: 44 ఏళ్ల తర్వాత.. ‘వరల్డ్‌కప్‌ రేసు’ నుంచి లంక అవుట్‌! ఎందుకిలా? కివీస్‌ వల్లే అప్పుడలా..
IPL 2023: తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు ఊహించని షాక్‌.. కీలక ఆటగాడు దూరం

Advertisement
Advertisement