IPL 2023: తొలి మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు ఊహించని షాక్‌.. కీలక ఆటగాడు దూరం

CSK name Akash Singh as replacement for Mukesh Choudhary - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. శుక్రవారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. అయితే తొలి మ్యాచ్‌కు ముందు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్‌ ముకేష్‌ చౌదరి గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీ  మొత్తానికి దూరమయ్యాడు. ‍

రంజీల్లో ఆడుతూ గత ఏడాది చివర్లో గాయపడిన ముకేష్ చౌదరి.. బెంగుళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పునరావసం పొందాడు. అనంతరం ఫిట్‌నెస్‌ సాధించి ఐపీఎల్‌-2023 కోసం సీఎస్‌కే జట్టుతో చేరాడు. అయితే నెట్స్‌లో బౌలింగ్ చేసిన ముకేష్ చౌదరి గాయం తిరగబెట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అతడు ఈ ఏడాది ఐపీఎల్‌ మొత్తానికి దూరమయ్యాడు. గత ఏడాది సీజన్‌లో సీఎస్‌కే తరపున ముఖేష్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 13 మ్యాచ్‌లాడిన ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్ బౌలర్ 16 వికెట్లు పడగొట్టాడు. 

ముకేష్‌ స్థానంలో ఆకాష్‌ సింగ్‌
ఇక గాయపడిన ముకేష్‌ స్థానంలో రాజస్తాన్‌ యువ పేసర్‌ ఆకాష్‌ సింగ్‌ను సీఎస్‌కే మెనెజ్‌మెంట్‌ భర్తీ చేసింది. ఆకాష్‌ సింగ్‌ను రూ.20లక్షల కనీస ధరకు చెన్నై సొంతం​చేసుకుంది.

గతంతో రాజస్తాన్‌ రాయల్స్‌ తరుపున ఆకాష్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. అదే విధంగా 2020 భారత అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టులో కూడా ఆకాష్‌ భాగంగా ఉన్నాడు. ఇక దేశీవాళీ క్రికెట్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన అతడు 31 వికెట్లు పడగొట్టాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top