IPL 2022-Tilak Varma: ఐపీఎల్‌లో తెలుగుతేజం తిలక్‌ వర్మ కొత్త చరిత్ర

IPL 2022: Tilak Varma 4th Player Most Runs Uncapped Player Debut Season - Sakshi

ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాడు.. తెలుగుతేజం నంబూరి తిలక్‌ వర్మ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. డెబ్యూ సీజన్‌లో ఒక అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తిలక్‌ వర్మ చోటు సంపాదించాడు. ఈ సీజన్‌లో తిలక్‌ వర్మ 14 మ్యాచ్‌లాడి 397 పరుగులు సాధించాడు. కాగా రెండు హాఫ్‌ సెంచరీలు తిలక్‌ ఖాతాలో ఉన్నాయి. ఇందులో 29 ఫోర్లు, 16 సిక్సర్లు ఉ‍న్నాయి.

డెబ్యూ సీజన్‌లో అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో తొలి స్థానంలో షాన్‌ మార్ష్‌ 616 పరుగులు (2008 సీజన్‌లో) ఉన్నాడు. ఇక దేవదత్‌ పడిక్కల్‌ 473 పరుగులు(2020 సీజన్‌లో) రెండో స్థానం, శ్రేయాస్‌ అయ్యర్‌ 439 పరుగులు(2015 సీజన్‌లో) మూడో స్థానంలో ఉండగా.. తిలక్‌ వర్మ 397 పరుగులు(2022 సీజన్‌లో) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక చివరగా ఐదో స్థానంలో రాహుల్‌ త్రిపాఠి 2017లో 391 పరుగులు సాధించాడు.

ముంబై ఇండియన్స్‌ జట్టుగా విఫలమైనప్పటికి తిలక్‌ వర్మ మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఘోర ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌లాడి 10 ఓటములు.. 4 విజయాలతో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే పోతూ పోతూ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆశలను అడియాశలను చేసింది. మ్యాచ్‌ గెలిస్తే కచ్చితంగా ప్లేఆఫ్‌ చేరాల్సిన ఢిల్లీ ముంబై దెబ్బకు తోకముడిచి ఇంటిబాట పట్టింది. ముంబై ఇండియన్స్‌ గెలుపు ఆర్‌సీబీకి వరంగా మారింది. నెట్‌ రన్‌రేట్‌ మైనస్‌లో ఉన్నప్పటికి ఢిల్లీ ఓటమితో ఆర్‌సీబీ నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.

చదవండి: ఢిల్లీతో పోరులో రోహిత్‌ శర్మ భారీ స్కోర్‌ సాధిస్తాడన్న రవిశాస్త్రి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top