IPL 2022: Sunrisers Hyderabad VS Rajasthan Royals Head to Head Records and Stats - Sakshi
Sakshi News home page

IPL 2022 SRH VS RR: హెడ్ టూ హెడ్‌ రికార్డ్స్‌ ఎలా ఉన్నాయంటే..!

Mar 29 2022 1:25 PM | Updated on Mar 29 2022 2:23 PM

IPL 2022: Sunrisers Hyderabad VS Rajasthan Royals Head To Head Records And Stats - Sakshi

SRH VS RR Head To Head Records: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇవాళ (మార్చి 29) తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఎన్నడూ లేనంత బలంగా కనిపిస్తుండగా.. ఇందు భిన్నంగా ఎస్‌ఆర్‌హెచ్‌ చాలా బలహీనంగా, ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగనుంది. గత రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఎదురెదురుపడిన 15 సందర్భాల్లో ఆరెంజ్ ఆర్మీ ఎనిమిది సార్లు, గులాబీ దళం ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు నమోదు చేశాయి. 

ఇరు జట్ల బలాబలాల విషయానికొస్తే.. సంజూ శాంసన్‌ నేతృత్వంలోని ఆర్‌ఆర్‌ జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, యుజ్వేంద్ర చహల్, ట్రెంట్ బౌల్ట్, షిమ్రోన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, జిమ్మీ నీషమ్, రస్సీ డస్సెన్, రియాన్ పరాగ్, నాథన్ కౌల్టర్ నీల్, ప్రసిద్ధ్ కృష్ణ, నవదీప్ సైనీ, యశస్వి జైస్వాల్, ఓబెద్‌ మెక్‌కాయ్‌ లాంటి దేశీ, విదేశీ స్టార్లతో కళకళలాడుతుండగా.. కేన్‌ విలియమ్సన్‌ సారధ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్‌ నికోలస్‌ పూరన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అబ్దుల్‌ సమద్‌, టి నటరాజన్‌, మార్కో జన్సెన్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, రొమారియో షెపర్డ్‌ లాంటి ఆటగాళ్లపై భారీ అంచనాలతో బరిలోకి దిగుతుంది. 

తుది జట్లు (అంచనా):

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మలిక్‌.

రాజస్థాన్‌ రాయల్స్‌: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, నాథన్ కౌల్టర్‌నీల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చహల్.
చదవండి: Ravi Shastri: నేను వేలంలో బరిలో ఉంటే కనీసం 15 కోట్లు కొల్లగొట్టేవాడిని..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement