
Courtesy: IPL T20.Com
ఐపీఎల్ 2022లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మయాంక్ అగర్వాల్ రూపంలో ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆ తర్వాత వచ్చిన బానుక రాజపక్స ఉన్న కాసేపు కేకేఆర్ బౌలర్లను హడలెత్తించాడు. 9 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేసిన రాజపక్స చివరికి శివమ్ మావి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో ఔటైన రాజపక్స అదే ఓవర్‌లోనే శివమ్ మావికి చుక్కలు చూపించాడు.
ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన మావి ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు సంధించాడు. దీంతో మావి షార్ట్ పిచ్ బంతి వేయగా.. రాజపక్స మరో సిక్సర్ సంధించే యత్నంలో మిడాఫ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అలా తన బౌలింగ్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన రాజపక్సను ఔట్ చేసి మావి పగ తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా గెట్ అవుట్ ఆఫ్ మై వే అంటూ మావి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.