Breadcrumb
Live Updates
IPL 2022: ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్
ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి.. కేకేఆర్ ఘన విజయం
ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్ మరో ఓటమి చవిచూసింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో ముంబై ఓటమి చెందింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 113 పరుగులకే కుప్పకూలింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో కిషన్ 51 పరుగలతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ మూడు, రస్సెల్ రెండు, సౌథీ, వరుణ్ చక్రవర్తి తలా వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(43),నితీష్ రాణా(43) పరుగులతో రాణించారు. ఇక కేకేఆర్‌కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, రహానే అద్భుతమైన ఆరంభం ఇచ్చారు.
అయితే బుమ్రా బౌలింగ్ దాటికి కేకేఆర్ మిడిల్లార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లుసాధించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా ఐదు, కుమార్ కార్తికేయ రెండు, అశ్విన్, సామ్స్ చెరో వికెట్ సాధించారు.
ఒకే ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయిన ముంబై
కమ్మన్స్ వేసిన 15 ఓవర్లో ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు కోల్పోయింది. కిషన్, సామ్స్, అశ్విన్ ఔటయ్యారు. 15 ఓవర్లకు ముంబై స్కోర్: 102/7
నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై
ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన డేవిడ్..వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లకు ముంబై స్కోర్: 100/4
మూడో వికెట్ కోల్పోయిన ముంబై
69 పరుగుల వద్ద ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రమణ్‌దీప్ సింగ్.. రస్సెల్ బౌలింగ్‌లో రాణాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ముంబై స్కోర్: 11 ఓవర్లకు 81/3
రెండో వికెట్ కోల్పోయిన ముంబై
32 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన తిలక్ వర్మ.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
4 ఓవర్లకు ముంబై స్కోర్: 26/1
4 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో తిలక్ వర్మ(1), ఇషాన్ కిషన్(19) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్.. రోహిత్ ఔట్
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయిది. 2 పరుగులు చేసిన రోహిత్.. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
ఐదు వికెట్లతో చెలరేగిన బుమ్రా.. ముంబై టార్గెట్ 166
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(43),నితీష్ రాణా(43) పరుగులతో రాణించారు. ఇక కేకేఆర్‌కు ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, రహానే అద్భుతమైన ఆరంభం ఇచ్చారు.
అయితే బుమ్రా బౌలింగ్ దాటికి కేకేఆర్ మిడిల్లార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లుసాధించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా ఐదు, కుమార్ కార్తికేయ రెండు, అశ్విన్, సామ్స్ చెరో వికెట్ సాధించారు.
వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన కేకేఆర్
కేకేఆర్ వరుస క్రమంలో మూడు వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికి షెల్డన్ జాక్సన్ ఔట్కాగా, మూడు, నాలుగు బంతులకు వరుసగా కమ్మిన్స్, నరైన్ పెవిలియన్‌కు చేరారు. 18 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 156/8
ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్
139 పరుగుల వద్ద కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన నితీష్ రాణా.. బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 13.5 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 139/4
నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్.. రస్సెల్ ఔట్
136 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన రస్సెల్.. బుమ్రా బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 13.2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 136/4
మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్
123 పరుగుల వద్ద కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. అశ్విన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 13.1 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 123/1
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్..
87 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన రహానేను కార్తీకేయ క్లీన్ బౌల్డ్ చేశాడు. 10.2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 64/1
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
60 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న వెంకటేశ్ అయ్యర్(43).. కార్తీకేయ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 6 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 64/1
4 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 31/0
4 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(20), రహానే(9) పరుగులతో ఉన్నారు.
2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 16/0
2 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో వెంకటేశ్ అయ్యర్(13), రహానే(2) పరుగులతో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై
ఐపీఎల్-2022లో భాగంగా డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు ముంబై స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా దూరమయ్యాడు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), తిలక్ వర్మ, రమణదీప్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, కుమార్ కార్తికేయ, జస్ప్రీత్ బుమ్రా, రిలే మెరెడిత్
కోల్‌కతా నైట్ రైడర్స్
అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్(వికెట్ కీపర్), టిమ్ సౌతీ, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి
Related News By Category
Related News By Tags
-
హార్దిక్ పాండ్యా మంచి మనసు.. ఆ 11 మందికి?
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్, భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన మంచి మనసును చాటుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని గ్రౌండ్ స్టాఫ్ ఒక్కొక్కరికి రూ.1...
-
రోహిత్, కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త ఇది. టెస్ట్‌లు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు, వచ్చే ఏడాది (2027) మే...
-
బుమ్రాకు సంబంధించి బిగ్ న్యూస్
ఐపీఎల్ 2026 ప్రారంభానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండగా.. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు సంబంధించిన ఓ విషయం అభిమానులను తెగ కంగారు పెట్టింది. ఇటీవల బుమ్రా బెంగళూరులోని బీసీసీఐ ...
-
’ముందు షారుఖ్ ఖాన్.. ఆ తర్వాత అతడే’
కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ అజింక్య రహానే సహచర ఆటగాడు రింకూ సింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన ఆట తీరుతో అనతికాలంలోనే రింకూ కేకేఆర్ ముఖచిత్రంగా మారిపోయాడని కొనియాడాడు. కాగా టీమ...
-
ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టం!
ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్‌కు అరుదైన గౌరవం కల్పించింది. గత సీజన్లో రస్సెల్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ ...


