గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే..?

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవాళ (మే 6) ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో నామమాత్రపు మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోగా, ముంబై ఇండియన్స్.. తామాడిన 9 మ్యాచ్‌ల్లో 8 పరాజయాలు, ఒకే ఒక్క విజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించింది.
ముంబై.. తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలుపుతో ప్రస్తుత సీజన్‌లో బోణీ విజయాన్ని (5 వికెట్ల తేడాతో) నమోదు చేయగా, గుజరాత్.. గత మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి పాలై సీజన్‌లో రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది.
తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే..
నేటి మ్యచ్ కోసం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చు. గత మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన తుది జట్లనే ఇరు జట్లు నేటి మ్యాచ్‌లోనూ కొనసాగించవచ్చు. ముంబై విషయానికొస్తే.. రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకీన్, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్‌లను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉండగా.. ఒక్క ఇషాన్ కిషన్‌పై వేటు పడే అవకాశాలు లేకపోలేదు.
ఒకవేళ ఇషాన్‌ను తప్పిస్తే.. అన్‌మోల్ ప్రీత్ సింగ్ అతని స్థానాన్ని భర్తీ చేయవచ్చు. మరోవైపు వరుస విజయాలతో దూసుకుపోతూ (గత మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో పరాజయం మినహా) జట్టు కూర్పు విషయంలో సరైన ప్లానింగ్ కలిగిన గుజరాత్.. నేటి మ్యాచ్‌లోనూ తుది జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశాలు లేవు. పంజాబ్‌తో మ్యాచ్‌లో దారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రదీప్ సాంగ్వాన్‌ను తప్పించాలనుకుంటే, అతని స్థానాన్ని యశ్ దయాల్‌తో భర్తీ చేయవచ్చు.
తుది జట్లు (అంచనా):
ముంబై ఇండియన్స్ : అన్‌మోల్ ప్రీత్ సింగ్/ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకీన్, డేనియల్ సామ్స్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జరీ జోసెఫ్, ప్రదీప్ సాంగ్వాన్/ యశ్ దయాల్, ఫెర్గూసన్, మహ్మద్ షమీ
చదవండి: IPL 2022: పొలార్డ్ వచ్చే ఏడాది గుజరాత్ టైటాన్స్‌కు ఆడతాడేమో!
మరిన్ని వార్తలు