Deepak Hooda-Krunal Pandya: 'ఒకప్పుడు కొట్టుకునే స్థాయికి'.. కట్‌చేస్తే

IPL 2022: Deepak Hooda Big Statement Krunal Pandya My-Brother-We-Do-Fight - Sakshi

కృనాల్‌ పాండ్యా.. దీపక్‌ హుడా... ఈ ఇద్దరి పేర్లు వినగానే టక్కున గుర్తుచ్చేది 2020-21 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో జరిగిన గొడవ. దాదాపు కొట్టుకునే స్థాయికి వెళ్లిన ఈ ఇద్దరిలో ఎవరు తగ్గలేదు. అప్పటి బరోడా జట్టుకు కలిసి ఆడుతున్న సమయంలో కృనాల్‌ తనపై దౌర్జన్యం చేశాడని దీపక్‌ హుడా ఆరోపించాడు. అటు కృనాల్‌ కూడా ఏమాత్రం తగ్గలేదు. అతని మిస్‌బిహేవియర్‌ నాకు నచ్చలేదని.. అందుకే తిట్టానంటూ వివరణ ఇచ్చాడు. ఈ ఉదంతం తర్వాత దీపక్‌ హుడా బరోడాకు గుడ్‌బై చెప్పి రాజస్తాన్‌ జట్టులోకి వెళ్లిపోయాడు. అప్పటినుంచి కృనాల్‌, దీపక్‌ హుడాలు ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు.


Courtesy: IPL Twitter
తాజాగా ఐపీఎల్‌ ఈ ఇద్దరిని మరోసారి ఎదురుపడేలా చేసింది. గత ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్‌ మెగావేలంలో దీపక్‌ హుడా, కృనాల్‌లను లక్నో సూపర్‌ జెయింట్స్‌ దక్కించుకుంది. అంత గొడవ జరిగిన తర్వాత ఈ ఇద్దరు ఎలా ఉంటారోనని అభిమానుల్లోనూ ఆసక్తి కలిగింది. అయితే చేదు జ్ఞాపకాలను మరిచిపోయి ఇద్దరు ఒకరినొకరు అభినందించుకోవడంతో గొడవకు ఎండ్‌కార్డ్‌ పడినట్లయింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో కృనాల్‌ వికెట్‌ తీసిన సందర్భంలో దీపక్‌ హుడా అతని వద్దకు వచ్చి అభినందిస్తూ హత్తుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం దీపక్‌ హుడా దైనిక్‌ జాగరణ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో కృనాల్‌తో పంచుకున్న సంతోషాన్ని వివరించాడు .

''కృనాల్‌ పాండ్యా నాకు సోదరుడులాండి వాడు. అన్నదమ్ముళ్లు అంటేనే సరదాగా కొట్టుకుంటారు. ఆట అన్నప్పుడు గొడవలు సాధారణం. అప్పుడు తప్పు అనిపించింది.. అందుకే కృనాల్‌పై విరుచుకుపడ్డా. అవన్నీ మరిచిపోయాం. ఇప్పుడు ఇద్దరం ఒకే జట్టుకు ఆడుతున్నాం. మా ఏకైక లక్ష్యం లక్నో సూపర్‌ జెయింట్స్‌ను విజేతగా నిలపడమే.'' అని చెప్పుకొచ్చాడు. ఇది విన్న అభిమానులు..''శత్రుత్వం ఎప్పటికి శాశ్వతం కాదని మరోసారి నిరూపించారు'' అని కామెంట్‌ చేశారు.

చదవండి: మ్యాచ్‌ గెలిచిన సంతోషం ముద్దుతో ఉక్కిరిబిక్కిరి; ట్విస్ట్‌ ఏంటంటే

IPL 2022: లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ షాక్‌.. విధ్వంసకర ఆటగాడు దూరం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top