IPL 2022 DC Vs SRH: ఎస్‌ఆర్‌హెచ్‌పై వార్నర్‌ అర్థశతకం.. ప్రపంచ రికార్డు బద్దలు

IPL 2022: David Warner Slams 50 Vs SRH Creates World Record T20 Cricket - Sakshi

ఐపీఎల్‌ 2022లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సూపర్‌ హాఫ్‌ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. తన పాత టీమ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌పై వార్నర్‌ విరుచుకుపడిన తీరు అద్భుతమని చెప్పాలి. ఆరంభంలో ఇన్నింగ్స్‌ నెమ్మదిగా ఆరంభించిన వార్నర్‌.. ఆ తర్వాత గేర్‌ మార్చి ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌ ఓవరాల్‌గా 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.

సెంచరీ అవకాశాన్ని మిస్‌ చేసుకున్నప్పటికి వార్నర్‌ పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టి20 క్రికెట్‌లో  అత్యధిక అర్థసెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా వార్నర్‌ నిలిచాడు. ఎస్‌ఆర్‌హెచ్‌పై చేసిన హాఫ్‌ సెంచరీ వార్నర్‌ ఖాతాలో 84వది. తద్వారా క్రిస్‌ గేల్‌(83 అర్థసెంచరీలు) పేరిట ఉన్న రికార్డును వార్నర్‌ బ్రేక్‌ చేశాడు. వార్నర్‌, గేల్‌ తర్వాత టీమిండియా మెషిన్‌గన్‌ విరాట్‌ కోహ్లి 77 హాఫ్‌ సెంచరీలతో మూడోస్థానంలో ఉన్నాడు. ఇక ఆసీస్‌ టి20 కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ 70 అర్థసెంచరీలతో నాలుగో స్థానంలో ఉండగా.. టీమిండియా టి20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 69 హాఫ్‌ సెంచరీలతో జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.

అంతేకాదు ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనే వార్నర్‌ మరో రికార్డు అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌లో మార్క్రమ్‌ బౌలింగ్‌లో లాంగాన్‌ దిశగా భారీ సిక్సర్‌ కొట్టిన వార్నర్‌.. టి20 క్రికెట్‌లో 400వ సిక్సర్‌ను పూర్తి చేసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో క్రిస్‌ గేల్‌ 1056 సిక్సర్లతో తొలి స్థానంలో ఉన్నాడు.

డేవిడ్‌ వార్నర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ కోసం క్లిక్‌ చేయండి

చదవండిDavid Warner: సెంచరీ చేయకపోయినా పంతం నెగ్గించుకున్న వార్నర్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top