KS Bharat: కప్‌ కొట్టి కోహ్లి చేతిలో పెట్టడమే లక్ష్యం

IPL 2021: KS Bharat Says Winning IPL Title And Giving To Virat Kohli - Sakshi

Srikar Bharat Comments On Virat Kohli.. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టి కోన శ్రీకర్‌ భరత్‌ ఒక్కసారి హీరోగా మారిపోయాడు. అంతేగాక 52 బంతుల్లోనే 78 పరుగులు చేసిన భరత్‌ మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా  భరత్‌ ఆర్‌సీబీ కెప్టెన్‌ కోహ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''కీలక సమయంలో ఒక మంచి ఇన్నింగ్స్‌తో మెరిసినందుకు సంతోషంగా ఉంది. యంగ్‌స్టర్స్‌ను ప్రోత్సహించడం కోహ్లికి ఉన్న గొప్ప అలవాటు. ఈసారి ఐపీఎల్‌ టైటిల్‌ కొట్టి కోహ్లి బాయ్‌కి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఐపీఎల్‌ టైటిల్‌తో పాటు కేక్‌పై చెర్రీ పెట్టి సెలబ్రేషన్స్‌ చేసుకుంటాం. ఎందుకంటే ఆర్‌సీబీ కెప్టెన్‌గా కోహ్లికి ఇదే ఆఖరి సీజన్‌. అందుకే కోహ్లికి గిఫ్ట్‌గా టైటిల్‌ను అందించాలనుకుంటున్నా.'' అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌ 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్‌ 10,11,13 తేదీల్లో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. అక్టోబర్‌ 15వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

చదవండి: T20 World Cup 2021: రోహిత్‌ భయ్యా.. మాకు రెండు టికెట్స్‌ ఇప్పించవా

శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్‌ క్రికెట్‌ చరిత్రలో 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top