BCCI Announces The IPL 2021 Full Schedule, RCB Set To Meet MI In Season-Opener On April 9 - Sakshi
Sakshi News home page

IPL 2021: క్యాష్‌ రిచ్‌ లీగ్‌ షెడ్యూల్‌ విడుదల

Mar 7 2021 2:12 PM | Updated on Apr 2 2021 8:46 PM

IPL 2021: BCCI Announces Schedule For IPL, Starts April 9 - Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-2021 షెడ్యూల్‌ విడుదలైంది.  ఈ మేరకు ఐపీఎల్‌ షెడ్యూల్‌ వివరాలను బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ సీజన్‌ ఐపీఎల్‌ ఏప్రిల్‌ 9వ తేదీన ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరుగనుంది. మే30వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్స్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌కు మొతేరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

మే30వ తేదీన ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా, హైదరాబాద్‌కు మాత్రం నిరాశే ఎదురైంది. ఓ దశలో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు నిర్వహించాలని అనుకున్నా చివరకు ఆరు నగరాలకు మాత్రమే ఐపీఎల్‌ మ్యాచ్‌లను పరిమితం చేశారు. ముంబైలో కోవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న కారణంగా హైదరాబాద్‌ అవకాశం దక్కుతుందనుకున్నప్పటికీ అది జరగలేదు. ముంబైలోనే నిర్వహించడానికి బీసీసీఐ పెద్దలు మొగ్గు చూపారు, ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు గం.3.30ని.లకు ఆరంభం కాగా, రాత్రి మ్యాచ్‌లు గం. 7.30లకు ప్రారంభం కానున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement