వెనుకంజలో భారత గోల్ఫర్లు | Indian golfers are in back step | Sakshi
Sakshi News home page

వెనుకంజలో భారత గోల్ఫర్లు

Aug 4 2024 4:12 AM | Updated on Aug 4 2024 7:13 AM

Indian golfers are in back step

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత గోల్ఫర్లు ప్రభావం చూపలేకపోతున్నారు. శనివారం మూడో రౌండ్‌ పోటీలు ముగిసేసరికి శుభాంకర్‌ శర్మ 34వ స్థానంలో.. గగన్‌జీత్‌సింగ్‌ భుల్లర్‌ 48 స్థానంలో నిలిచారు. రెండు రౌండ్‌లు ముగిసేసరికి మెరుగైన స్థితిలో కనిపించిన శుభాంకర్‌... శనివారం పోటీల్లో తొమ్మిది స్థానాలు కోల్పోయి.. 211 పాయింట్లతో నిలిచాడు. 

సెర్బియా గోల్ఫర్‌ రహమ్‌ జాన్‌ (199) టాప్‌లో ఉన్నాడు. మొత్తం 18 హోల్స్‌ ఉన్న ఈ పోటీల్లో నాలుగు రౌండ్‌లు నిర్వహించనున్నారు. ఇందులో మెరుగైన షాట్లు ఆడిన తొలి ముగ్గురు గోల్ఫర్లకు పతకాలు దక్కుతాయి. ఆదివారం చివరి రౌండ్‌ పోటీలు జరగనున్నాయి. ఇక మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్‌ నుంచి అదితి అశోక్, దీక్ష డాగర్‌ బరిలోకి దిగనున్నారు.   

నేత్ర, విష్ణు ఎదురీత 
పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత సెయిలర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. మహిళల డింగీ విభాగంలో 6 రేసులు ముగిసేసరికి భారత సెయిలర్‌ నేత్ర కుమానన్‌ 24వ స్థానంలో నిలిచింది. మూడు రేసులు ముగిసేసరికి 11వ ప్లేస్‌లో ఉన్న నేత్ర శనివారం ఐదు, ఆరు రేసుల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. పురుషుల ఈవెంట్‌లో విష్ణు శరవణన్‌ 23వ స్థానంలో ఉన్నాడు. 10 రేసులు ముగిసేసరికి టాప్‌–10లో ఉన్న సెయిలర్లు ఫైనల్‌కు అర్హత సాధించనున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement