అమన్‌కు రజతం | aman wins silver | Sakshi
Sakshi News home page

అమన్‌కు రజతం

Apr 13 2026 11:32 AM | Updated on Apr 13 2026 12:39 PM

aman wins silver

బిష్‌కెక్‌ (కిర్గిస్తాన్‌): ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు భారత్‌కు రెండు రజతాలు, ఒక కాంస్య పతకం లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత అమన్‌ సెహ్రావత్‌ (61 కేజీలు), ముకుల్‌ దహియా (86 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... దినేశ్‌ (125 కేజీలు) కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.

 ఫైనల్స్‌లో అమన్‌ 10–13తో క్వాంగ్‌ మ్యోంగ్‌ కిమ్‌ (ఉత్తర కొరియా) చేతిలో, ముకుల్‌ 0–7తో కామ్రాన్‌ ఘాసెమ్‌పూర్‌ (ఇరాన్‌) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్‌లో దినేశ్‌ 12–1తో తుర్దుబెకోవ్‌ (కిర్గిస్తాన్‌)పై గెలిచాడు. ఓవరాల్‌గా పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో భారత్‌ 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచి 162 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది. 4 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం గెలిచి 178 పాయింట్లతో ఇరాన్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement