Sakshi News home page

నిశాంత్‌కు నిరాశ 

Published Wed, Mar 13 2024 5:27 AM

Indian boxer who lost in the quarter final - Sakshi

క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన భారత బాక్సర్‌  

బుస్టో అర్సిజియో (ఇటలీ): పారిస్‌ ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ తొలి టోర్నమెంట్‌ నుంచి తొమ్మిది మంది భారత బాక్సర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బరిలో మిగిలిన చివరి బాక్సర్‌ నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోయాడు. అమెరికా బాక్సర్‌ ఒమారి జోన్స్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో నిశాంత్‌ 1–4తో ఓటమి చవిచూశాడు.

మహిళల విభాగంలో భారత్‌ నుంచి ఇప్పటి వరకు నలుగురు బాక్సర్లు (నిఖత్‌ జరీన్, ప్రీతి పవార్, పర్విన్‌ హుడా, లవ్లీనా) పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. మిగిలిన భారత బాక్సర్లకు ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందు రెండో అవ కాశం ఉంది. మే 23 నుంచి జూన్‌ 3 వరకు థాయ్‌లాండ్‌లో జరిగే చివరిదైన రెండో క్వాలిఫయింగ్‌ టోర్నిలో సెమీఫైనల్‌ చేరితే భారత బాక్సర్లకు ఒలింపిక్‌ బెర్త్‌లు లభిస్తాయి.  

Advertisement
Advertisement