ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌.. 347 పరుగుల తేడాతో భారీ విజయం | India women hammer England to register biggestever victory in womens Test | Sakshi
Sakshi News home page

ENG vs IND: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్‌.. 347 పరుగుల తేడాతో భారీ విజయం

Dec 16 2023 12:10 PM | Updated on Dec 16 2023 12:12 PM

 India women hammer England to register biggestever victory in womens Test - Sakshi

ముంబై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో 347 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది.  479 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు.. భారత బౌలర్ల దాటికి కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు దీప్తీ శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్‌ చెలరేగడంతో మూడో రోజు తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్‌ చాపచుట్టేసింది.

భారత బౌలర్లలో దీప్తి శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పుజా వస్త్రాకర్‌ మూడు ,  గైక్వాడ్‌ రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హీథర్‌ నైట్‌(21) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 186/6 వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన అధిక్యాన్ని కలుపుకుని ఇంగ్లండ్‌ ముందు 479 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్‌ ఉంచింది.

అదే విధంగా ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరిచింది. మొదటి ఇన్నింగ్స్‌లోనూ 136 పరుగులకే ఇంగ్లండ్‌ ఆలౌటైంది. భారత్‌ విషయానికి వస్తే.. తమ తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం 428 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారత బ్యాటర్లలో శుభ సతీశ్‌ (76 బంతుల్లో 69; 13 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్‌ (99 బంతుల్లో 68; ), యస్తిక భాటియా (88 బంతుల్లో 66; 10 ఫోర్లు, 1 సిక్స్‌), దీప్తి శర్మ (111 బంతుల్లో 67 ; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు కెప్టెన్‌ హర్మాన్‌ ప్రీత్‌ కౌర్‌(49) పరుగులతో రాణించింది. కాగా మహిళల టెస్టు క్రికెట్‌ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం గమనార్హం.
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌.. ఆ ఇద్దరూ కూడా! బీసీసీఐ అధికారిక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement