సెమీస్‌తో పతకాన్ని ఖాయం చేసుకున్న భారత్‌ | India secures medal with semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌తో పతకాన్ని ఖాయం చేసుకున్న భారత్‌

Oct 10 2025 4:12 AM | Updated on Oct 10 2025 4:12 AM

India secures medal with semis

ప్రపంచ జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు పతకంతో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ ఈవెంట్‌లో భారత్‌  జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత జట్టు 44–45, 45–30, 45–33తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. సెమీస్‌ చేరడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. బాలుర డబుల్స్‌లో భార్గవ్‌ రామ్‌–విశ్వతేజ్‌ జంట 5–9తో చొ హ్యోంగ్‌ వూ–లీ హ్యోంగ్‌ వూ జోడీ చేతిలో ఓడింది. 

బాలికల డబుల్స్‌లో వెన్నెల–రిషిక జోడీ 10–9తో చివోన్‌ హ్యూ– మున్‌ ఇన్‌ సియో జంటపై గెలిచింది. తర్వాత బాలుర సింగిల్స్‌లో రౌనక్‌ చౌహాన్‌ 11–9తో చొయ్‌ అహ్‌ సియంగ్‌ను ఓడించాడు. కానీ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో లాల్‌రామ్‌సంగ–అన్య బిష్త్‌ జోడీ 4–9తో లీ–చివోన్‌ జంట చేతిలో ఓడింది. కీలకమైన మహిళల సింగిల్స్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ ఉన్నతి హుడా గెలుపొందడంతో భారత్‌ విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement