బోపన్న చివరిపోరు...

India and Morocco Davis Cup match from today - Sakshi

నేటి నుంచి భారత్, మొరాకో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌

లక్నో: ప్రపంచ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ డేవిస్‌ కప్‌లో తన ప్రస్థానాన్ని ముగించడానికి భారత డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న సిద్ధమయ్యాడు. మొరాకోతో నేడు మొదలయ్యే వరల్డ్‌ గ్రూప్‌–2 డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. 2002లో తొలిసారి డేవిస్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 43 ఏళ్ల బోపన్న 32 మ్యాచ్‌లు ఆడి 22 మ్యాచ్‌ల్లో విజయం అందుకున్నాడు. తొలి రోజు శనివారం రెండు సింగిల్స్‌ జరుగుతాయి. యాసిన్‌ దిల్మీతో శశికుమార్‌ ముకుంద్, ఆడమ్‌ మౌన్‌డిర్‌తో సుమిత్‌ నగాల్‌ ఆడతారు.

ఆదివారం ఒక డబుల్స్‌తోపాటు రెండు రివర్స్‌ సింగిల్స్‌ను నిర్వహిస్తారు. డబుల్స్‌ మ్యాచ్‌లో రోహన్‌ బోపన్న–యూకీ బాంబ్రీ జోడీ ఇలియట్‌ బెన్‌చిట్రి–యూనస్‌ లారూసి జంటతో ఆడుతుంది. రివర్స్‌ సింగిల్స్‌లో యాసిన్‌ దిల్మీతో సుమిత్‌ నగాల్, ఆడమ్‌ మౌన్‌డిర్‌తో శశికుమార్‌ ముకుంద్‌ తలపడతారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ మ్యాచ్‌కు సంబంధించి ‘డ్రా’ వివరాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డేవిస్‌కప్‌ కెరీర్‌ను ముగిస్తున్న రోహన్‌ బోపన్నను సన్మానించారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top