గిల్‌ హాఫ్‌ సెంచరీ.. సెంచరీ దిశగా రాహుల్‌.. ఆధిక్యంలో టీమిండియా | IND VS WI 1st Test Day 2: Gill Completed Half Century, Rahul Travelling Towards Century | Sakshi
Sakshi News home page

గిల్‌ హాఫ్‌ సెంచరీ.. సెంచరీ దిశగా రాహుల్‌.. ఆధిక్యంలో టీమిండియా

Oct 3 2025 11:06 AM | Updated on Oct 3 2025 11:24 AM

IND VS WI 1st Test Day 2: Gill Completed Half Century, Rahul Travelling Towards Century

గిల్‌ ఔట్‌
శుభ్‌మన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన వెంటనే ఔటయ్యాడు. రోస్టన్‌ ఛేజ్‌ బౌలింగ్‌లో జస్టిన్‌ గ్రీవ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. 59 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 192/3గా ఉంది. ప్రస్తుతం భారత్‌ 30 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రాహుల్‌ 86, జురెల్‌ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

అహ్మదాబాద్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రోజు తొలి సెషన్‌లోనే ఇది సాధించింది. 56 ఓవర్ల తర్వాత భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ 188/2గా ఉంది. ప్రస్తుతం టీమిండియా 26 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

శుభ్‌మన్‌ గిల్‌ (50) అర్ద సెంచరీ పూర్తి చేసుకోగా.. రాహుల్‌ (84) సెంచరీ దిశగా సాగుతున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 36, సాయి సుదర్శన్‌ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. విండీస్‌ బౌలర్లలో జేడన్‌ సీల్స్‌, రోస్టన్‌ ఛేజ్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌  162 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సిరాజ్‌ (14-3-40-4), బుమ్రా (14-3-42-3), కుల్దీప్‌ (6.1-0-25-2), వాషింగ్టన్‌ సుందర్‌ (3-0-9-1) ధాటికి విండీస్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది.

విండీస్‌ ఇన్నింగ్స్‌లో ఏడో నంబర్‌ ఆటగాడు జస్టిన్‌ గ్రీవ్స్‌ చేసిన 32 పరుగులే అత్యధికం. గ్రీవ్స్‌ కాకుండా అలిక్‌ అథనాజ్‌ (12), బ్రాండన్‌ కింగ్‌ (13), కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (24), షాయ్‌ హోప్‌ (26), ఖారీ పియెర్‌ (11) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు.

మిగతా వారిలో జాన్‌ క్యాంప్‌బెల్‌ 8, తేజ్‌నరైన్‌ చంద్రపాల్‌ డకౌట్‌, జోమెల్‌ వార్రికన్‌ 8, జోహన్‌ లేన్‌ ఒక్క పరుగుకు ఔటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో భారత వికెట్‌కీపర్‌ ధృవ్‌ జురెల్‌ 4 క్యాచ్‌లు పట్టాడు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.  

చదవండి: World Cup 2025: పాకిస్తాన్‌కు షాకిచ్చిన బంగ్లాదేశ్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement