శ్రేయస్ అయ్యర్ (PC: BCCI X)
లక్నో వేదికగా వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ‘‘ఏకనా పిచ్ మిశ్రమంగా ఉంటుంది. ఇక్కడ తేమ ప్రభావం కూడా పడుతుంది. కాబట్టి మేము ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము.
కఠిన సవాలు
శనివారమే ఆసియా క్రీడల ఫైనల్ గెలిచి స్వర్ణంతో స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత.. మూడు రోజుల్లోనే (మంగళవారం) ఈ మ్యాచ్ ఆడటం కాస్త ఇబ్బందిగానే ఉంది. నిజానికి జపాన్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక్క రోజు మా ఇంట్లో ఉన్నాను. ఆ తర్వాత లక్నోకు వచ్చేశాను.
వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు
ఏదేమైనా ఈరోజు మ్యాచ్ మాకు కఠిన సవాలు విసరబోతోంది. విండీస్ ఆఖరి వన్డేలో అద్భుతంగా ఆడింది. టీ20 క్రికెట్‌లో కరేబియన్ల ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండేళ్లుగా వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు.
విండీస్ జట్టును అంచనా వేయడం చాలా కష్టం.. షాయీ హోప్ సహా ఎంతో మంది అద్బుతమైన బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు. ఆల్‌రౌండర్లకు కూడా కొదవలేదు’’ అని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌ను తాము ఎంతమాత్రం తేలికగా తీసుకోవడం లేదని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.
అతడి పేరు మర్చిపోయిన శ్రేయస్ అయ్యర్
అదే సమయంలో విండీస్‌తో తొలి టీ20 తుదిజట్టుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ శ్రేయస్ అయ్యర్ ఓ ఆటగాడి పేరు మర్చిపోయాడు. ‘‘మా తుదిజట్టులో రవి బిష్ణోయి, నితీశ్ రెడ్డి, వైభవ్ సూర్యవంశీ లేరు. ఇంకో ఆటగాడు కూడా ఈరోజు ఆడటం లేదు. నేను అతడి పేరును మర్చిపోయాను.
హా.. గుర్తొచ్చింది. ప్రిన్స్ యాదవ్ కూడా తుదిజట్టులో లేడు’’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. కాగా జపాన్ వేదికగా ఆసియా క్రీడల టోర్నీ ఫైనల్లో పాకిస్తాన్‌పై గెలిచిన టీమిండియా వరుసగా రెండో ఎడిషన్‌లో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.
వైభవ్‌తో పాటు అతడికి దక్కని చోటు
ఇక పాక్‌తో టైటిల్ పోరులో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీతో పాటు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా ఆడారు. అయితే, వాషీ, బుమ్రాకు విండీస్ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వగా.. విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్‌లకు చోటు దక్కలేదు. ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, నమన్ ధిర్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
ఇటీవలే వెస్టిండీస్‌తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో అరంగేట్రం చేసిన నమన్ ధిర్.. తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. విండీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచి వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
తొలి టీ20కి భారత తుదిజట్టు
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, నమన్ ధిర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మయాంక్ యాదవ్
బెంచ్: వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయి, నితీశ్ కుమార్ రెడ్డి.
విండీస్ తుదిజట్టు
షాయీ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమిల్ పూరన్, షిమ్రన్ హెట్‌మెయిర్, రోవ్‌మన్ పావెల్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్, రొమారియో షెఫర్డ్, మాథ్యూ ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, అకీల్ హొసేన్, షమార్ జోసెఫ్, షమార్ స్ప్రింగర్.
బెంచ్: ఆమిర్ జాంగూ, గుడకేశ్ మోటి, కీమో పాల్, క్విన్‌టిన్ సామ్‌ప్సన్.
చదవండి: నాశనం చేస్తున్నారు: గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ ఫైర్


