
అహ్మదాబాద్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్ బ్యాటింగ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. చహల్ వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్ ఆఖరి బంతికి విండీస్ బ్యాటర్ షమ్రా బ్రూక్స్ వికెట్‌కీపర్ క్యాచ్ ఔట్ కోసం టీమిండియా ఆటగాళ్లు అపీల్ చేశారు. అయితే ఈ అపీల్‌ను అంతగా పట్టించుకోని ఫీల్డ్ అంపైర్ బ్రూక్స్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీనిపై రివ్యూకి వెళ్లేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలుత వికెట్‌కీపర్ పంత్‌ను సంప్రదించగా, అతను బంతి బ్యాట్‌కు తాకలేదని చెప్పాడు. ఇంతలో కోహ్లి వారి దగ్గరికి వచ్చి బంతి బ్యాట్‌కు కచ్చితంగా తాకిందని చెప్పడంతో రోహిత్ ఏమాత్రం ఆలోచించకుండా రివ్యూకి వెళ్లాడు.
Kohli - 100% bat
— `` (@KohlifiedGal) February 6, 2022
Rohit Reviews
Decision overturned pic.twitter.com/ynMKaXCrfX
అనంతరం రివ్యూలో బ్రూక్స్ ఔట్ అని తేలడం, ఆ తర్వాత విండీస్ 176 పరుగులకే ఆలౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. కాగా, రివ్యూ సందర్భంగా రోహిత్ అండ్ కో మధ్య మైదానంలో జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కోహ్లినా మజాకా అని అతని ఫ్యాన్స్ గొప్పలకుపోతున్నారు. మరికొందరేమో రోహిత్‌కు కోహ్లిపై అపారమైన నమ్మకముందని, ఎంతైనా కోహ్లి 7 ఇయర్స్ ఇండస్ట్రీ అని, రోహిత్-కోహ్లి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవనడానికి ఇంతకుమించి సాక్ష్యమేముంటుందని కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. 43.5 ఓవర్లలో 176 పరుగులకే విండీస్‌ను ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), పేసర్లు ప్రసిద్ద్ కృష్ణ(2/29), మహ్మద్ సిరాజ్(1/26)లు రెచ్చిపోవడంతో ప్రత్యర్ధి స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. విండీస్ జట్టులో ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.
చదవండి: Virat Kohli: డొక్కు కారు పంపి ఆర్సీబీ యాజమాన్యం అవమానించింది..!