Umran Malik: ఏంటా స్పీడ్‌! పంత్‌ బ్యాట్‌ విరగ్గొట్టిన ఉమ్రాన్‌ మాలిక్‌!?

Ind vs SA: Umran Malik Reportedly Breaks Rishabh Pant Bat In Nets - Sakshi

Ind Vs SA T20 Series: ఉమ్రాన్‌ మాలిక్‌.. వేగానికి పర్యాయపదంగా మారుతున్నాడు. తన బౌలింగ్‌ టెక్నిక్‌తో క్రీడా పండితుల ప్రశంసలు అందుకుంటున్న ఈ యువ పేసర్‌ గంటకు కనీసం 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌-2022లో 14 సార్లూ ‘ఫాస్టెస్ట్‌ బాల్‌’ అవార్డు గెలుచుకున్న ఉమ్రాన్‌ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో తొలిసారిగా జాతీయ జట్టులో చోటుదక్కించుకున్నాడు. అయితే, ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో మాత్రం బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఉమ్రాన్‌ పేరు క్రికెట్‌ ప్రేమికుల నోళ్లలో నానుతూనే ఉంది. అతడికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వీటి ఆధారంగా.. ప్రాక్టీసు​ సెషన్‌లో భాగంగా గంటకు సుమారు 160కి పైగా వేగంతో బంతులు విసిరినట్లు తెలుస్తోంది. ఉమ్రాన్‌ వేగానికి టీమిండియా యువ క్రికెటర్‌, ప్రస్తుత సిరీస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ బ్యాట్‌ విరిగిపోయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ప్రొటిస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. జూన్‌ 12న కటక్‌ వేదికగా జరుగనున్న రెండో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. 

చదవండి: Mohsin Khan: ‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్‌ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top