Rahul Dravid: ద్రవిడ్‌ బలం అదే.. అన్నింటిలోనూ తనదైన ముద్ర! కాబట్టి

Ind Vs SA: Sanjay Manjrekar Says Handling Young Players Dravid Greatest Strength - Sakshi

టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గురించి సంజయ్‌ మంజ్రేకర్‌ వ్యాఖ్యలు

Ind Vs SA T20 Series: భారత అండర్‌-19 జట్టు కోచ్‌గా.. ఇషాన్‌ కిషన్‌, రిషభ్‌ పంత్‌, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లను ‍మెరికల్లా తీర్చిదిద్దిన ఘనత రాహుల్‌ ద్రవిడ్‌ సొంతం. అతడి మార్గదర్శనంలోనే భారత యువ జట్టు 2018లో అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. పృథ్వీ షా సారథ్యంలో న్యూజిలాండ్‌ను ఓడించి ఐసీసీ ట్రోఫీ గెలిచింది.

ఇక రాహుల్‌ ద్రవిడ్‌ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో వరుస టీ20 సిరీస్‌లు గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత్‌ సన్నద్ధమవుతోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా వంటి సీనియర్లకు రెస్ట్‌ ఇవ్వగా.. మొదటి మ్యాచ్‌ ఆరంభానికి ముందు కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు. దీంతో రిషభ్‌ పంత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు.

కాగా పంత్‌ కెప్టెన్సీలోని ఈ జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ ద్రవిడ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును విజయపథంలో నడిపించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య అని కొనియాడాడు.

ఈ మేరకు..‘‘అత్యంత తెలివైన క్రికెటర్లలో ద్రవిడ్‌ ఒకడు. చాలా స్మార్ట్‌. జూనియర్‌ లెవల్లో ఎంతో మంది ఆటగాళ్లను గొప్పగా తీర్చిదిద్దిన ఘనత అతడిది. ముఖ్యంగా యువ క్రికెటర్లలోని నైపుణ్యాలు వెలికితీసి.. రాణించేలా ప్రోత్సహించాడు. 

ఈ గుణమే అతడి బలం. తన పరిధిలో ఉన్న ప్రతి అంశం మీద పూర్తి పట్టు సాధించి.. మెరుగైన ఫలితాలు రాబడతాడు’’ అని న్యూస్‌ 18తో మంజ్రేకర్‌ వ్యాఖ్యానించాడు. ఇక మైదానం వెలుపల తన ప్రణాళికలు ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లు ముందున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపికలో అతడి పాత్ర మరింత ఎక్కువగా ఉండబోతుందని అభిప్రాయపడ్డాడు. కాగా జూన్‌ 9 నుంచి భారత్‌- దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఉమ్రాన్‌ మాలిక్‌, ఆర్ష్‌దీప్‌ సింగ్‌కు నో ఛాన్స్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top