IND Vs SA 2022: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఉమ్రాన్‌ మాలిక్‌, ఆర్ష్‌దీప్‌ సింగ్‌కు నో ఛాన్స్‌..!

Aakash Chopra picks Team Indias likely XI for 1st T20I vs South Africa - Sakshi

ఐపీఎల్‌-2022 ముగిసిన తర్వాత తొలి సారిగా టీమిండియా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడనుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా గురువారం(జూన్‌9) జరగనుంది. అయితే తొలి టీ20కు ముందే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, వెటరన్‌ స్పిన్నర్‌ కుల్ధీప్‌ యాదవ్‌ గాయం కారణంగా సిరీస్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో తొలి టీ20కు భారత తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు ఆకాష్‌ చోప్రా తొలి టీ20కు భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ను అంచనా వేశాడు. అతడు ఎంపిక చేసిన జట్టులో యువ పేసర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, ఆర్షదీప్‌ సింగ్‌కు చోటు దక్కలేదు. ఈ జట్టుకు ఓపెనర్లుగా ఇషాన్‌ కిషన్‌‌, రుతురాజ్ గైక్వాడ్‌లను చోప్రా ఎంచుకున్నాడు.

వరుసగా మూడు నాలుగు స్థానాల్లో వరుసగా శ్రేయస్‌ అయ్యర్‌, హార్ధిక్‌ పాండ్యాకు అతడు చోటిచ్చాడు. ఇక తమ జట్టులో వికెట్‌ కీపర్‌గా కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను ఎంపిక చేశాడు. ఆరో స్థానంలో హుడా లేదా కార్తీక్‌కు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు అతడు తెలిపాడు. ఆల్ రౌండర్ల కోటాలో అక్షర్‌ పటేల్‌కు చోటు ఇచ్చాడు. ఇక తన జట్టులో బౌలర్లగా భువనేశ్వర్‌ కుమార్‌, యుజ్వేంద్ర చాహల్, హర్షల్‌ పటేల్‌,ఆవేష్‌ ఖాన్‌ను ఎంపిక చేశాడు.

ఆకాశ్ చోప్రా టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌:
ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్(కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), దీపక్ హుడా/దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్‌,భువనేశ్వర్ కుమార్
చదవండి: Dinesh Karthik: నాడు ‘బెస్ట్‌ ఫినిషర్‌’ ధోని ‘జీరో’.. డీకే సూపర్‌ షో! ఇప్పుడు కూడా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top