IND VS SA 5th T20: Temba Bavuma Doubtful To Play Due To Injury - Sakshi
Sakshi News home page

IND VS SA 5th T20: సిరీస్ డిసైడర్.. కెప్టెన్ ఔట్‌..!

Jun 19 2022 6:15 PM | Updated on Jun 19 2022 6:24 PM

IND VS SA 5th T20: Temba Bavuma Doubtful To Play Due To Injury - Sakshi

బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగనున్న నిర్ణయాత్మక ఐదో టీ20కి ముందు దక్షిణాఫ్రికా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. నాలుగో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో గాయపడ్డ ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బవుమా ఇంకా కోలుకోలేదని సమాచారం. సిరీస్‌ డిసైడ్‌ చేసే ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ అందుబాటులో ఉండకపోతే ఆ జట్టు జయాపజాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. మ్యాచ్‌ సమయానికి బవుమా అందుబాటులో ఉండకపోతే కేశవ్‌ మహారాజ్‌ లేదా క్వింటన్ డికాక్‌లలో ఒకరు ప్రోటీస్‌ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. 

ఇక నేటి మ్యాచ్‌ తుది జట్ల విషయానికొస్తే.. ఇరు జట్లు నాలుగో టీ20లో బరిలోకి దిగిన జట్లనే యధాతథంగా కొనసాగించవచ్చు. మ్యాచ్‌ సమయానికి బవుమా ఫిట్‌గా లేకపోతే అతని స్థానంలో రీజా హెండ్రిక్స్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. నాలుగో టీ20 ఆడిన జట్టే యధాతథంగా బరిలోకి దిగడం ఖాయంగా తెలుస్తోంది. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటంతో టీమిండియా ప్రయోగాలు చేసే సాహసం చేయకపోవచ్చు. కాగా, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 0-2తో వెనుకపడి ఆ తర్వాత ఆనూహ్యంగా పుంజుకుని 2-2తో సిరీస్‌ను సమం చేసిన విషయం తెలిసిందే. 

తుది జట్లు (అంచనా)..

భారత్: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్. 

దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్/టెంబా బావుమా (కెప్టెన్), రస్సీ వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డ్వైన్ ప్రిటోరియస్, మార్కో జన్సెన్‌, కేశవ్ మహరాజ్, ఎన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, తబ్రేజ్ షంషి.
చదవండి: టి20 చరిత్రలో ప్రొటీస్‌పై టీమిండియాకు అతి పెద్ద విజయం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement