Biggest Win By-Runs For India Vs SA In T20Is - Sakshi
Sakshi News home page

IND vs SA: టి20 చరిత్రలో ప్రొటీస్‌పై టీమిండియాకు అతి పెద్ద విజయం

Jun 18 2022 8:44 AM | Updated on Jun 18 2022 4:10 PM

Biggest Win By-Runs For India Vs SA In T20Is - Sakshi

రాజ్‌కోట్‌ వేదికగా శుక్రవారం జరిగిన నాలుగో టి20లో టీమిండియా సౌతాఫ్రికాపై 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది. ఈ క్రమంలోనే టీమిండియా తమ టి20 చరిత్రలో ప్రొటీస్‌ జట్టుపై అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇటీవలే వైజాగ్‌ వేదికగా జరిగిన మూడో టి20లో 48 పరుగుల విజయం రెండో అతి పెద్దదిగా ఉండగా.. ఇక 2007లో డర్బన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 37 పరుగులతో విజయం మూడోదిగా ఉంది.


ఇక టి20ల్లో సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. తాజాగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 87 పరుగులకే కుప్పకూలింది. ఇంతకముందు 2020లో జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో టి20లో 89 పరుగులు రెండో అత్యల్పంగా ఉంది. సౌతాఫ్రికాకు మూడో అత్యల్ప స్కోరు(96 పరుగులు) మళ్లీ ఆస్ట్రేలియాపైనే ఉంది, 2018లో శ్రీలంకతో టి20లో 98 పరుగులు దక్షిణాఫ్రికాకు నాలుగో అత్యల్ప టి20 స్కోరు.

చదవండి: Dinesh Karthik: 37 ఏళ్ల వయసులో..'డీకే'తో అట్లుంటది మరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement