
ఆసియాకప్-2023లో మరోసారి భారత్-పాకిస్తాన్ పోరుకు రంగం సిద్దమయ్యాయి. ఈ మెగా టోర్నీ సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాక్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. కాగా ఇప్పటికే లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థిల పోరు వర్షం కారణంగా తుడుచుకుపోయిన సంగతి తెలిసిందే.
దీంతో దాయాదుల పోరు కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. భారత్‌పై కచ్చితంగా విజయం సాధిస్తామని థీమా వ్యక్తం చేశాడు.
"మేము గత రెండు నెలల నుంచి శ్రీలంకలో క్రికెట్ ఆడుతున్నాము. ఇక్కడ తొలుత శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో తలపడ్డాం. ఆ తర్వాత జట్టులో చాలా మంది ఆటగాళ్లు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడారు. అదే విధంగా ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఇక్కడే ఆఫ్గాన్‌తో వన్డే సిరీస్ కూడా ఆడాం. కాబట్టి లంక పరిస్ధితులను మేము బాగా ఆర్ధం చేసుకున్నాము.
ఆ అనుభవంతో భారత జట్టుపై పైచేయి సాధిస్తామని బాబర్ ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. అదే విధంగా పాక్ పేస్ త్రయం షహీన్ షా అఫ్రిది, హారీస్ రవూఫ్, నసీం షాపై బాబర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"మాకు మా పేసర్లు బంతితో అద్భుతమైన ఆరంభాన్ని ఇస్తున్నారు. అదే విధంగా మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసేందుకు కూడా మేము ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాము. మా దగ్గర సరైన బౌలింగ్ కాంబనేషన్ ఉంది. ఒక వేళ ఒక బౌలర్ విఫలమైనా మరొకరు ఆ బాధ్యత తీసుకుంటారు అని బాబర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: Gautam Gambhir: లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన.. అతడి రాక! ఇకపై గంభీర్..