Ravindra Jadeja Sword Celebration: ఫిప్టీ కొట్టాడు.. తన స్టైల్లో మళ్లీ తిప్పేశాడు

IND vs NZ 2021: Ravindra Jadeja Signature Sword Celebration After Fifty - Sakshi

Ravindra Jadeja Signature Sword Celebration.. టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఫన్‌ క్రియేట్‌ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన జడేజా బ్యాటింగ్‌లో సెంచరీ.. హాఫ్‌ సెంచరీ కొట్టినప్పుడల్లా బ్యాట్‌ను కత్తిలాగా తిప్పడం అలవాటుగా చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలాసార్లు వైరల్‌ అయ్యాయి. తాజాగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా మరోసారి అర్థ శతకం సాధించాడు. అయ్యర్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించిన జడేజా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

100 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 50 పరుగుల మార్క్‌ను అందుకున్న జడేజాకు  టెస్టుల్లో ఇది 17వది. జడేజా ఫిఫ్టీతో పాటే టీమిండియా తొలిరోజు ఆట ముగిసింది. అయితే పెవిలియన్‌కు వెళ్తూ వెళ్తూ.. జడేజా తన స్టైల్లో బ్యాట్‌ను కత్తిలా తిప్పి అభిమానులను అలరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: Shreyas Iyer: డెబ్యూతోనే అదరగొట్టిన అయ్యర్‌.. పుజారా, రహానేలకు హెచ్చరిక!

ఇక మ్యాచ్‌లో తొలిరోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.  శ్రేయాస్‌ అయ్యర్‌ 75*, రవీం‍ద్ర జడేజా 50* పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరిమధ్య ఇప్పటివరకు ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అంతకముందు శుబ్‌మన్‌ గిల్‌ 52 పరుగులు చేసి ఔట్‌ కాగా.. మిగతా టీమిండియా బ్యాటర్స్‌లో రహానే 35, పుజారా 26, మయాంక్‌ 13 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో కైల్‌ జేమీసన్‌ 3 వికెట్లు తీశాడు.

చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్‌ అయ్యి బతికిపోయావు.. లేదంటే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top