Shreyas Iyer: డెబ్యూతోనే అదరగొట్టిన అయ్యర్‌.. పుజారా, రహానేలకు హెచ్చరిక!

IND vs NZ: Shreyas Iyer Warns Pujara And Rahane Test Debut Half Century - Sakshi

Shreyas Iyer Warning Pujara And Rahane With Test Debut Half Century.. టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌ డెబ్యూ టెస్టు మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. సీనియర్లైన రహానే, పుజారాలు విఫలమైన వేళ శ్రేయాస్‌ సూపర్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. 94 బంతుల్లో అర్థసెంచరీ మార్క్‌ చేరుకున్న అయ్యర్‌ ప్రస్తుతం 137 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా ఆడుతున్నాడు. అయ్యర్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు.. 2 సిక్సర్లు ఉన్నాయి. ఇక జడేజాతో కలిసి అయ్యర్‌ ఐదో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు. అయితే ఇప్పుడు అయ్యర్‌ ఇన్నింగ్స్‌ పుజారా, రహానేలను ఇరకాటంలో పడేసేలా ఉంది. అసలే ఫామ్‌లేక తంటాలు పడుతున్న వీరిద్దరికి అయ్యర్‌ ఇన్నింగ్స్‌ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.

చదవండి: James Neesham: 'అన్నిసార్లు టీమిండియానే గెలుస్తుంది.. నాకేదో అనుమానంగా ఉంది'

ఇప్పటికే రహానే ఔటైన తీరుపై సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు విపరీతమైన ట్రోల్స్‌ చేశారు. అటు పుజారా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం  రానున్న టెస్టుల్లో వీరిద్దరి స్థానాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు రహానే, పుజారాలకు పెద్దగా నష్టం లేకపోయినప్పటికి.. భవిష్యత్తులో అయ్యర్‌ లాంటి ఆటగాడి వల్ల జట్టులో చోటు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్‌ అయ్యి బతికిపోయావు.. లేదంటే

అయితే అభిమానులు మాత్రం అయ్యర్‌ ప్రదర్శనపై రెండుగా చీలిపోయారు.'' ఒక్క మ్యాచ్‌లో అర్థసెంచరీ చేసినంత మాత్రానా సీనియర్లకు హెచ్చరికలా పంపినట్టా.. ఇది అయ్యర్‌కు తొలి మ్యాచ్‌ మాత్రమే.. పుజారా, రహానేల అనుభవం అతనికి లేదు..  అయ్యర్‌..సూపర్‌.. టెస్టుల్లో కూడా స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడేమో..''  అంటూ కామెంట్స్‌ చేశారు.


చదవండి: India vs New Zealand Test: టెస్టుల్లో సరికొత్త రికార్డు సృష్టించిన రచిన్ రవీంద్ర...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top