IND vs NZ 2021: James Neesham Hilarious Tweet After New Zealand Lost Toss - Sakshi
Sakshi News home page

James Neesham: 'అన్నిసార్లు టీమిండియానే గెలుస్తుంది.. నాకేదో అనుమానంగా ఉంది'

Nov 25 2021 5:14 PM | Updated on Nov 26 2021 10:28 AM

IND vs NZ 2021: James Neesham Hiilarious Tweet After New Zeland Loss Toss - Sakshi

James Neesham Comments After Nz Loss Toss 1st Test.. టీమిండియా పర్యటనలో న్యూజిలాండ్‌ వరుసగా టాస్‌ ఓడిపోవడంపై ఆ జట్టు ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశాడు. ''అన్నిసార్లు టీమిండియానే టాస్‌ గెలుస్తుంది.. నాకెందుకో ఏదో జరుగుతుందని అనుమానం ఉంది.. ఎవరైనా వెళ్లి టాస్‌ కాయిన్‌ను క్లోజ్‌గా పరిశీలించండి'' అంటూ ట్విటర్‌ వేదికగా ఫన్నీ కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం నీషమ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

చదవండి: Trolls On Ajinkya Rahane: కెప్టెన్‌ అయ్యి బతికిపోయావు.. లేదంటే

ఇక భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌కు టాస్‌ కలిసిరాలేదు. ఇ‍ప్పటికే ముగిసిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్‌ ఒక్కసారి కూడా టాస్‌ గెలవలేదు. ఈ మూడు మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచిన టీమిండియా అన్నింటా విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. తాజాగా కాన్పూర్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులోనూ న్యూజిలాండ్‌ మరోసారి టాస్‌ ఓడిపోయింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా తొలిరోజు ఆట ముగిసేసరికి 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులతో పటిష్టస్థితిలో నిలిచింది. గిల్‌ అర్థ సెంచరీ సాధించి ఔట్‌ కాగా.. ఆ తర్వాత వచ్చిన అయ్యర్‌, జడేజాలు కూడా హాఫ్‌ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. కివీస్‌ బౌలర్లలో కైల్‌ జేమిసన్‌ మాత్రమే 3 వికెట్లతో కాస్త ప్రభావం చూపెట్టాడు.

చదవండి: అసలే కోపంలో ఉన్నాడు.. క్రీజులో హెల్మెట్‌ అడ్డుగా

Advertisement
 
Advertisement
Advertisement