రెండో టెస్టుకు సాహా దూరం.. కేఎస్‌ భరత్‌కు అవకాశం!

Reports: Saha Dougtful For 2nd Test Vs NZ KS Bharath May Replace - Sakshi

టీమిండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా రెండో టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెడనొప్పి గాయంతో ఇబ్బంది పడుతున్న సాహా రెండో టెస్టు సమయానికి కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ అంబ్రే ఒక ప్రకటనలో వెల్లడించినట్లు సమాచారం. ఫిజియోలు సాహా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మెడనొప్పి అలాగే ఉంటే మాత్రం సాహా స్థానంలో కేఎస్‌ భరత్‌ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కాగా తొలి టెస్టులో టీమిండియా ఫీల్డింగ్‌ సమయంలో సాహా మెడనొప్పితో బాధపడుతూ కీపింగ్‌కు రాలేదు. దీంతో కేఎస్‌ భరత్‌ సబ్‌స్టిట్యూట్‌ వికెట్‌ కీపర్‌గా విధులు నిర్వహించాడు. అయితే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బ్యాటింగ్‌కు దిగిన సాహా నాలుగేళ్ల తర్వాత టెస్టుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ సాధించి టీమిండియాకు మంచి ఆధిక్యం సాధించడంలో కృషి చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top