Ind Vs Eng- 1st Warm Up Match: కెప్టెన్‌గా డీకే.. హుడా అర్ధ శతకం.. భారత్‌ ఘన విజయం!

Ind vs Eng: Dinesh Karthik Lead India Won By 7 Wickets Warm Up 1st T20 - Sakshi

Derbyshire vs Indians, 1st T20 Warm-up Match: ఇంగ్లండ్‌తో సిరీస్‌ నేపథ్యంలో భారత్‌ డెర్బిషైర్‌ కౌంటీ జట్టుతో తొలి టీ20 వార్మప్‌ మ్యాచ్‌ ఆడింది. డెర్బీలోని కౌంటీ గ్రౌండ్‌ వేదికగా శుక్రవారం(జూలై 1) ఈ మ్యాచ్‌ జరిగింది. ఇందులో భారత్‌ ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ వార్మప్‌ మ్యాచ్‌లో వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్ భారత జట్టును ముందుండి నడిపించాడు.

టాస్‌ గెలిచి..
డెర్బిషైర్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో డెర్బిషైర్‌ జట్టు 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.

హుడా అద్భుత ఇన్నింగ్స్‌!
ఇక లక్ష్య ఛేదనకు దిగిన కార్తిక్‌ సేనకు ఓపెనర్‌ సంజూ శాంసన్‌(38 పరుగులు) శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(3 పరుగులు) పూర్తిగా విఫలమయ్యాడు.​ ఇక వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన దీపక్‌ హుడా మరోసారి సత్తా చాటాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేశాడు.

హుడా అర్ధ శతకానికి సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌  (36 పరుగలు నాటౌట్‌) తోడు కావడంతో భారత జట్టు 16.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ డీకే 7 పరుగులతో అజేయంగా నిలిచాడు.

కాగా జూలై 7 నుంచి టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ వార్మప్‌ మ్యాచ్‌లో విజయం సంగతి ఇలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా తమ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు. 

ఆఖరి టెస్టు తొలి రోజు ఆట ముగిసిన తర్వాత పదకొండున్నర గంటల(భారత కాలమానం ప్రకారం) సమయంలో టీ20 తొలి వార్మప్‌ మ్యాచ్‌ ఆరంభమైంది. ఈ నేపథ్యంలో అటు టెస్టులో భారత్‌ మెరుగైన స్థితిలో ఉండటం.. మరోవైపు వార్మప్‌ మ్యాచ్‌లో విజయంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.  

చదవండి: IND Vs ENG Test Day 1: పంత్‌ పరాక్రమం.. మెరుగైన స్థితిలో టీమిండియా
India Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్‌స్టార్‌: పంత్‌పై ప్రశంసల జల్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top