
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ బంతి(Nitish Kumar Reddy)తో అద్బుతం చేశాడు. తన సూపర్ బౌలింగ్‌తో ఒకే ఓవర్‌లో ఇంగ్లీష్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీని పెవిలియన్‌కు పంపాడు. తొలి సెషన్‌లో 13 ఓవర్ వరకు డకెట్, క్రాలీ తమ వికెట్‌ను కాపాడుకుంటూ ఆచితూచి ఆడారు.
జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ పేసర్లు సైతం వీరిని ఔట్ చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. మీడియం పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌ను ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు.
14 ఓవర్ వేసిన నితీశ్.. మూడో బంతికి బెన్ డకెట్(23), ఆఖరి బంతికి జాక్ క్రాలీ(18) ఔట్ చేశాడు. దీంతో భారత్ మళ్లీ గేమ్‌లోకి తిరిగొచ్చింది. అయితే రెండో టెస్టులో మాత్రం నితీశ్ బ్యాట్‌తో, బంతితో రాణించలేకపోయాడు. దీంతో అతడిని లార్డ్స్ టెస్టుకు పక్కన పెట్టాలని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
కానీ హెడ్ కోచ్ గంభీర్, గిల్ అతడిపై నమ్మకంతో తుది జట్టులో కొనసాగించారు. తనకు వచ్చిన అవకాశాన్ని నితీశ్ సద్వినియోగపరుచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో కాస్త తడబడుతోంది. 19 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 54 పరుగులు చేసింది. క్రీజులో రూట్(12), పోప్(1) ఉన్నారు.
తుదిజట్లు
భారత్
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి.
ఇంగ్లండ్
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.
చదవండి: టీమిండియాతో టెస్టు సిరీస్.. ఇంగ్లండ్ జట్టులో ముగ్గురు భారత సంతతి ఆటగాళ్లు