Ind Vs Aus 1st ODI: తొలి వన్డేలో టీమిండియా విజయం

Ind Vs Aus 1st ODI Mumbai Toss Playing XI Updates And Highlights - Sakshi

India vs Australia, 1st ODI Updates: 
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 39.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కేఎల్‌ రాహుల్‌ (91 బంతుల్లో 75 పరుగులు నాటౌట్‌) తన కెరీర్‌ బెస్ట్‌ ఇన్నింగ్స్‌తో ఆపద్భాందవుడి పాత్ర పోషించగా.. జడేజా(69 బంతుల్లో 45 పరుగులు నాటౌట్‌) తన స్టైల్‌ ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ మూడు వికెట్లు తీయగా.. స్టోయినిస్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

టీమిండియా విజయానికి చేరువైంది. కేఎల్‌ రాహుల్‌ అర్థసెంచరీతో కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. జడేజా అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులతో ఆడుతున్న టీమిండియా విజయానికి 17 పరుగుల దూరంలో ఉంది.

► ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా వంద పరుగుల మార్క్‌ను అందుకుంది. ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియా 25వ ఓవర్‌లో ఈ మార్క్‌ను అందుకుంది. రాహుల్‌ 32, జడేజా 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 పాండ్యా, రాహుల్‌ ఇన్నింగ్స్‌తో గాడిన పడిందనుకున్న టీమిండియాకు షాక్‌ తగిలింది. 25 పరుగులు చేసిన పాండ్యా స్టోయినిస్‌ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. భారత్‌ విజయానికి 102 పరుగులు అవసరం ఉంది. 

► గిల్‌(20) రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది.

189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను ఆరంభంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ముందుగా మూడు పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌ స్టోయినిస్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగ్గా.. విరాట్‌ కోహ్లి నాలుగు పరుగుల వద్ద స్టార్క్‌ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. ఆ తర్వాత మరుసటి బంతికే ఎల్బీ రూపంలో సూర్యకుమార్‌ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

189 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌.. స్టోయినిష్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

188 పరుగులకు ఆసీస్‌ ఆలౌట్‌..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్లు విజృంభించడంతో కేవలం 188 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ, సిరాజ్‌ చెరో మూడు వికెట్లతో ఆసీస్‌ పతనాన్ని శాసించగా.. జడేజా రెండు, కుల్దీప్‌, హార్దిక్‌,  తలా వికెట్‌ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్‌ మార్ష్‌(81) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

184 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన స్టోయినిస్‌.. షమీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

174 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్‌ కోల్పోయింది. 12 పరుగులు చేసిన గ్రీన్‌ను షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

140 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన లబుషేన్‌ను కుల్దీప్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు.

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. మార్ష్‌ ఔట్‌
ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. 81 పరుగులతో దూకుడుగా ఆడుతోన్న మిచెల్‌ మార్ష్‌ను జడేజా పెవిలియన్‌కు పంపాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన మార్ష్‌.. సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..
77 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. 22 పరుగులు చేసన ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌.. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి మార్నస్‌ లాబుషేన్‌ వచ్చాడు.

11 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 70/1 (11)

50 పరుగుల మార్కును దాటిన ఆసీస్‌
మిచెల్‌ మార్ష్‌, స్మిత్‌ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగుతున్నారు. 9 ఓవర్లు ముగిసే సరికి మార్ష్‌ 6 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేయగా.. స్మిత్‌ 3 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరి నిలకడైన ఆటతో ఆసీస్‌ 50 పరుగుల మార్కును దాటింది. స్కోరు: 53-1(9)

5 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 29/1
స్మిత్‌ 5, మార్ష్‌ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..
5 పరుగులు వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ను మహ్మద్‌ సిరాజ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

ముంబైలోని వాంఖడే స్డేడియం వేదికగా తొలి వన్డేలో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కావడంతో.. హార్ధిక్‌ పాండ్యా జట్టు పగ్గాలు చేపట్టాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అదే విధంగా యువ పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇ‍క ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. ఈ సిరీస్‌కు ప్యాట్‌ కమ్మిన్స్‌ దూరం కావడంతో ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ ‍స్టీవ్‌ స్మిత్‌ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు డేవిడ్‌ వార్నర్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

తుది జట్లు
భారత్‌: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్‌ రాహుల్(వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్‌), మార్నస్ లాబుషేన్‌, జోష్ ఇంగ్లిస్(వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top