అగర్వాల్‌ ట్రిపుల్‌ సెంచరీ.. ఇన్నింగ్స్‌ తేడాతో హైదరాబాద్‌ విజయం | Hyderabad completes Arunachal drubbing on Day 2 | Sakshi
Sakshi News home page

అగర్వాల్‌ ట్రిపుల్‌ సెంచరీ.. ఇన్నింగ్స్‌ తేడాతో హైదరాబాద్‌ విజయం

Jan 27 2024 6:30 PM | Updated on Jan 27 2024 7:10 PM

Hyderabad completes Arunachal drubbing on Day 2 - Sakshi

రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో హైదరాబాద్‌ జైత్ర యాత్ర కొనసాగుతోంది.  ప్లేట్‌ గ్రూపులో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 180 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన అరుణాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్‌ బౌలర్లలో మిలాంద్‌, కార్తీకేయ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. త్యాగరాజన్‌ రెండు వికెట్లు సాధించారు.

అనంతరం హైదరాబాద్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి ఏకంగా  615 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బ్యాటర్లలో తన్మయ్‌ అగర్వాల్‌ ట్రిపుల్‌ సెంచరీతో చెలరేగాడు. 147 బంతుల్లోనే 300 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 181 బంతులు ఎదుర్కొన్న అగర్వాల్‌.. 34 ఫోర్లు, 26 సిక్స్‌లతో 366 పరుగులు చేశాడు.

మరో ఓపెనర్‌ హ్లోత్‌ 105 బంతుల్లో 185 పరుగులతో సత్తా చాటాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 443 పరుగుల అధిక్యం సాధించింది. 443 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అరుణాచల్‌.. 256 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌ కేవలం రెండు రోజుల్లోనే ముగించింది.
చదవండి: IND vs ENG: రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. శ్రీనాథ్‌ రికార్డు బద్దలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement