రాకాసి సిక్సర్‌.. కొడితే ఏకంగా..! | Sakshi
Sakshi News home page

SA20 2024: రాకాసి సిక్సర్‌.. కొడితే ఏకంగా..!

Published Sun, Jan 21 2024 4:54 PM

Heinrich Klaasen 105m Gigantic Six Lands On Stadium Roof In SA20 - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌తో నిన్న (జనవరి 20) జరిగిన మ్యాచ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ రాకాసి సిక్సర​్‌ బాదాడు. లియామ్‌ డాసన్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌ బాదిన ఈ సిక్సర్‌ ఏకంగా 105 మీటర్ల దూరం​ వెళ్లి, లీగ్‌ చరిత్రలోనే భారీ సిక్సర్‌గా రికార్డైంది. కళ్లు చెదిరే ఈ షాట్‌ చూసి అభిమానులు ముగ్దులవుతున్నారు.

ఆధునిక క్రికెట్‌లో అతి భారీ సిక్సర్‌ అంటూ కొనియాడుతున్నారు. భారీ కాయుడైన క్లాసెన్‌ బలంగా బాదడంతో బంతి ఏకంగా స్టేడియం రూఫ్‌ ఎక్కింది. క్రికెట్‌ చరిత్రలో లాంగెస్ట్‌ సిక్సర్‌కు సంబంధించిన పూర్తి డేటా లేకపోవడంతో ఈ సిక్సర్‌కు ఎలాంటి అధికారిక గుర్తిం‍పు దక్కలేదు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ వరకైతే ఇదే అతి భారీ సిక్సర్‌ అని లీగ్‌ నిర్వహకులు ప్రకటించారు. మొత్తానికి ఈ రాకాసి సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరవలవుతుంది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖర్లో వియాన్‌ ముల్దర్‌ (29 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగిపోయాడు. బ్రీట్జ్కీ (35), క్లాసెన్‌ (31), ప్రిటోరియస్‌ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో  హార్మర్‌ 4 వికెట్లు పడగొట్టగా.. డేనియల్‌ వారెల్‌, బార్ట్‌మన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

అనంతరం ట్రిస్టన్‌ స్టబ్స్‌ (66 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జన్సెన్‌ (24 నాటౌట్‌), మార్క్రమ్‌ (38), హెర్మన్‌ (25) ఓ మోస్తరుగా రాణించారు. సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లలో స్టోయినిస్‌ 2, రీస్‌ టాప్లే, కేశవ్‌ మహారాజ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓటమితో సూపర్‌ జెయింట్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. సన్‌రైజర్స్‌ మూడో ‍స్థానానికి ఎగబాకింది.

 
Advertisement
 
Advertisement