
సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్- మార్క్రమ్ (PC: IPL/SAT20)
సౌతాఫ్రికా టీ20 లీగ్ (SAT20)వేలానికి రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 9న ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన వేలంపాట జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆరుజట్లు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.
ఇందులో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్‌నకు సంబంధించిన రిటెన్షన్ లిస్టు అభిమానులను ఆశ్చర్యపరిచింది. కావ్యా మారన్ (Kavya Maran) నేతృత్వంలోని ఈ ఫ్రాంఛైజీ కేవలం ట్రిస్టన్ స్టబ్స్‌ను మాత్రమే రిటైన్ చేసుకుంది. అదే విధంగా.. జానీ బెయిర్ స్టో, ఏఎమ్ ఘజన్‌ఫర్, ఆడం మిల్నేలతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంది.
మార్క్రమ్ గుడ్‌బై!
అదే విధంగా వైల్డ్‌కార్డ్ విభాగంలో మార్కో యాన్సెన్ (Marco Jansen) సన్‌రైజర్స్ జట్టులో ఉండనున్నాడు. అయితే, కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ పేరు మాత్రం ఇందులో లేదు. కాగా 2023లో సౌతాఫ్రికా టీ20 లీగ్ మొదలుకాగా.. అరంగేట్ర సీజన్‌లోనే మార్క్రమ్ తన అద్భుత కెప్టెన్సీతో జట్టును విజేతగా నిలిపాడు.
గతేడాది కూడా సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించిన ఈ సౌతాఫ్రికా బ్యాటర్.. ఈ ఏడాది ఫైనల్‌కు చేర్చాడు. ఆరంభం నుంచి జట్టుకు వెన్నెముకగా ఉంటున్న మార్క్రమ్.. ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన విషయం తెలిసిందే.
ఐపీఎల్‌లోనూ అంతే
అయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు హైదరాబాద్ ఫ్రాంఛైజీ మార్క్రమ్‌ను విడిచిపెట్టగా.. లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.
రెండు టైటిళ్లు
తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ మార్క్రమ్ సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్‌తో తెగదెంపులు చేసుకుని.. వేలంలోకి వచ్చేందుకు సిద్ధం కావడం గమనార్హం. రెండుసార్లు ట్రోఫీ అందించిన ఈ స్టార్ ప్లేయర్‌ను సన్‌రైజర్స్ తిరిగి వేలంలో కొనుగోలు చేస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
సౌతాఫ్రికా టీ20 లీగ్-2025 రిటెన్షన్స్ జాబితా
ఎంఐ కేప్‌టౌన్
👉రిటైన్డ్ ప్లేయర్లు: ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, రియాన్ రికెల్టన్, కగిసో రబడ, జార్జ్ లిండే, కార్బిన్ బాష్.
👉ముందస్తు ఒప్పందం: నికోలస్ పూరన్.
సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్
👉ముందస్తు ఒప్పందం: జానీ బెయిర్‌స్టో, ఏఎమ్ ఘజన్‌ఫర్, ఆడం మిల్నే.
👉రిటైన్డ్ ప్లేయర్లు: ట్రిస్టన్ స్టబ్స్
👉వైల్డ్‌కార్డు: మార్కో యాన్సెన్
జొహన్నస్‌బర్గ్ సూపర్ కింగ్స్
👉రిటైన్డ్ ప్లేయర్లు: ఫాఫ్ డుప్లెసిస్, డొనొవాన్ ఫెరీరా
👉ముందస్తు ఒప్పందం: జేమ్స్ విన్స్, అకీల్ హొసేన్
ప్రిటోరియా క్యాపిటల్స్
👉ముందస్తు ఒప్పందం: ఆండ్రీ రసెల్, విల్ జాక్స్, షెర్ఫానే రూథర్‌ఫర్డ్
పర్ల్ రాయల్స్
👉రిటైన్డ్ ప్లేయర్లు: లువామన్-డి- ప్రిటోరియస్, డేవిడ్ మిల్లర్, జార్జ్ ఫార్చూన్
👉ముందస్తు ఒప్పందం: సికందర్ రజా, ముజీబ్-ఉర్- రహమాన్
డర్బన్ సూపర్ జెయింట్స్
👉ముందస్తు ఒప్పందం: సునిల్ నరైన్
👉రిటైర్డ్ ప్లేయర్లు: నూర్ అహ్మద్
👉వైల్డ్ కార్డ్: హెన్రిచ్ క్లాసెన్.
నిబంధనలు ఇవే
కాగా సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు నిబంధన ప్రకారం.. ఫ్రాంఛైజీలు ఆరు కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోకూడదు. అంతేకాదు ఓ జట్టులో ఏడు కంటే ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు ఉండకూడదు. అదే విధంగా.. కనీసం 11 మంది సౌతాఫ్రికా క్రికెటర్లు జట్టులో ఉండాలి. ఈ టీ20 లీగ్‌లో మొత్తం 108 స్లాట్లకు గానూ రిటెన్షన్స్ తర్వాత 72 ఖాళీలు ఉన్నాయి.
చదవండి: ఈ టెస్టులో ఆడిస్తే అతడికి అన్యాయం చేసినట్లే: అశ్విన్