హైదరాబాదంటే నాకెంతో ఇష్టం.. ఆతృతగా ఎదురుచూస్తున్నా: కమ్మిన్స్‌ | 'Have heard a lot about Orange Army': Pat Cummins - Sakshi
Sakshi News home page

హైదరాబాదంటే నాకెంతో ఇష్టం.. ఆతృతగా ఎదురుచూస్తున్నా: కమ్మిన్స్‌

Dec 20 2023 11:13 AM | Updated on Dec 20 2023 11:29 AM

Have heard a lot about Orange Army: Pat Cummins - Sakshi

ఐపీఎల్‌-2024 వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌పై కాసుల వర్షం కురిసింది. రూ. 2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వచ్చిన కమ్మిన్స్‌ను రూ. 20.50 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. కమ్మిన్స్‌ కోసం ఆర్సీబీతో పోటీ పడి ఎస్‌ఆర్‌హెచ్‌ దక్కించుకుంది. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్న రెండో ఆటగాడిగా కమ్మిన్స్‌ రికార్డులకెక్కాడు.

ఇక రికార్డు ధర దక్కించుకోవడంపై కమ్మిన్స్‌ స్పందించాడు. "సన్‌రైజర్స్‌తో జత కట్టేందుకు అమితోత్సాహంతో ఉన్నా. ఆరెంజ్‌ ఆర్మీ గురించి చాలా విన్నా. హైదరాబాద్‌లో కూడా మ్యాచ్‌లు ఆడా. నాకు బాగా నచ్చింది. నాతో పాటు హెడ్‌ కూడా ఉన్నాడు. విజయాలతో సీజన్‌ సాగాలని ఆశిస్తున్నా" అని స్టార్‌ స్పోర్ట్స్‌తో కమ్మిన్స్‌ పేర్కొన్నాడు.

కాగా కమ్మిన్స్‌కు గతంలో ఐపీఎల్‌లో ఆడిన అనువభం ఉంది. ప్యాట్‌ కమిన్స్‌ ఢిల్లీ తరఫున 12 మ్యాచ్‌లు, కోల్‌కతా తరఫున 30 మ్యాచ్‌లు ఆడి మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు. 2020 వేలంలో కేకేఆర్‌ అతనికి రూ. 15.50 కోట్లు ఇచ్చింది. అంతర్జాతీయ షెడ్యూల్‌ కారణంగా 2023 సీజన్‌లో కమిన్స్‌ ఆడలేదు. వరల్డ్‌ కప్‌లో జట్టును విజేతగా నిలిపి అతను మళ్లీ ఇక్కడ అడుగు పెట్టాడు. 
చదవండి: IPL 2024: టెన్త్‌ క్లాస్‌తో చదువు బంద్‌.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్‌ మింజ్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement