5 వేల మీటర్లలో గుల్‌వీర్‌ సింగ్‌ కొత్త జాతీయ రికార్డు | Gulveer Singh betters his own national record in men’s 5000m | Sakshi
Sakshi News home page

5 వేల మీటర్లలో గుల్‌వీర్‌ సింగ్‌ కొత్త జాతీయ రికార్డు

Sep 29 2024 1:07 PM | Updated on Sep 29 2024 1:07 PM

Gulveer Singh betters his own national record in men’s 5000m

యోగిబో అథ్లెటిక్స్‌ చాలెంజ్‌ కప్‌ టోర్నీలో భారత అథ్లెట్‌ గుల్‌వీర్‌ సింగ్‌ 5000 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు కొత్త జాతీయ రికార్డును కూడా నెలకొల్పాడు. జపాన్‌ లో శనివారం జరిగిన ఈ రేసులో 26 ఏళ్ల గుల్‌వీర్‌ 5000 మీటర్ల దూరాన్ని 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా 13 నిమిషాల 18.92 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును గుల్‌వీర్‌ బద్దలు కొట్టాడు. ఈ ఏడాది 
ఆరంభంలో పోర్ట్‌లాండ్‌ ట్రాక్‌ ఫెస్టివల్‌లో గుల్‌వీర్‌ ఈ సమయాన్ని నమోదు చేశాడు.    

Advertisement
 
Advertisement
Advertisement