సింగపూర్ సిటీ: భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్... డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌కు ప్రతీ రౌండ్‌లోనూ గట్టి పోటీనే ఇస్తున్నాడు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సమరంలో భాగంగా శుక్రవారం భారత్, చైనా ప్రత్యర్థుల మధ్య పోటాపోటీగా సాగిన నాలుగో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగిసింది. నల్లపావులతో బరిలోకి దిగిన భారత టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ ఎత్తులకు డిఫెండింగ్ చాంపియన్ తడబడ్డాడు.
32 ఏళ్ల లిరెన్ పైఎత్తులకు దీటైన సమాధానం ఇవ్వడంతో చివరకు 42 ఎత్తుల తర్వాత ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇద్దరు ‘డ్రా’కు అంగీకరించారు. తొలి గేమ్‌లో ఓడిన గుకేశ్ రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. తిరిగి మూడో రౌండ్లో సత్తా చాటుకున్న 18 ఏళ్ల ఈ భారత ఆటగాడు... చైనా గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించాడు.
తాజాగా నాలుగో రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగియడంతో ఇద్దరు 2–2 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచారు. ఇంకా 10 గేమ్‌లు మిగిలిఉన్న ఈ చాంపియన్‌షిప్‌లో ముందుగా ఎవరైతే 7.5 పాయింట్లు సాధిస్తారో వారే విజేతగా నిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment