
Photo Courtesy: BCCI
బెంగళూరు నగర వీధుల జనసంద్రంగా మారాయి. ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఇవాళ మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో ఆర్సీబీ సభ్యులకు ఘన స్వాగతం లభించింది. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సహా ఆర్సీబీ బృంద సభ్యులంతా ప్రత్యేక బస్సులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసేందుకు బయల్దేరారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ 'విధాన సౌధ' ముందు సిద్దరామయ్య చేతుల మీదుగా ఆర్సీబీ సభ్యులకు సన్మానం జరుగనుంది.
WHAT A WELCOME FOR RCB IN BENGALURU. pic.twitter.com/8KFfcxiWj4
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025
విధాన సౌధకు వెళ్లే దారిలో ఆర్సీబీ అభిమానులు ఇసుకేస్తే రాలనంతగా ఉన్నారు. ఆర్సీబీ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనంపై పూల వర్షం కురుస్తుంది. ఆర్సీబీ, విరాట్ కోహ్లి నామస్మరణతో బెంగళూరు నగర వీధులు మార్మోగిపోతున్నాయి. ఆర్సీబీ బృంద సభ్యులు ప్రయాణిస్తున్న బస్సులో విరాట్ కోహ్లి ముందు కూర్చుకున్నాడు. విరాట్ బస్సు అద్దాల గుండా అభిమానులకు అభివాదం చేస్తున్నాడు. విరాట్ తన భార్య అనుష్కతో పాటు ఉన్నాడు.
MASSIVE CROWD OUTSIDE CHINNASWAMY STADIUM...!!! 🙏👊 pic.twitter.com/hK7Hpbcmi8
— Johns. (@CricCrazyJohns) June 4, 2025
ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఓపెన్ టాప్ బస్సులో విక్టరీ పరేడ్ జరగడం లేదు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను కలిసిన తర్వాత పోలీసులు విక్టరీ పరేడ్‌కు అనుమతిచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదలా ఉంచితే, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్ల సత్కార కార్యక్రమం జరుగనుంది. టికెట్, పాస్ ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని పోలీసులు చెప్పారు.
🚨 KARNATAKA DEPUTY CM WELCOMING KOHLI & RCB TEAM 🚨 [ANI] pic.twitter.com/y6V338rWfx
— Johns. (@CricCrazyJohns) June 4, 2025
విరాట్ బృందానికి వెల్‌కమ్ చెప్పిన కర్ణాటక డీసీఎం
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఆర్సీబీ బృంద సభ్యులకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి (డీసీఎం) డీకే శివకుమార్ ఘన స్వాగతం పలికాడు. డీకే విరాట్ కోహ్లికి ప్రత్యేకంగా పూలు ఇచ్చి స్వాగతం పలికాడు. డీకే విరాట్‌ను ఆర్సీబీ జెండాతో పాటు కర్ణాటక జెండా పట్టుకోవాల్సిందిగా కోరాడు.
THE CROWD OUTSIDE VIDHANA SOUDHA FOR RCB 🤯 pic.twitter.com/13YK0AzpYz
— Johns. (@CricCrazyJohns) June 4, 2025