టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆటగాడు వచ్చేస్తున్నాడు!

Good news, Rishabh Pant back with Delhi Capitals camp - Sakshi

టీమిండియాకు ఓ గుడ్‌ న్యూస్‌. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌.. అతి త్వరలోనే రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఏన్సీఏలో ఉన్న రిషబ్‌ మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ప్రత్యేక ట్రైనర్‌ సాయంతో శిక్షణ పొందుతున్నాడు. ఎప్పటికప్పుడు తన హెల్త్‌ అప్‌డేట్స్‌ను అభిమానులతో పంత్‌ పంచుకుంటున్నాడు. తాజాగా యాంటీ గ్రావిటీ ట్రెడ్‌మిల్‌పై సాధన చేస్తూ ఉన్న వీడియోను పంత్‌ షేర్‌ చేశాడు.

ఢిల్లీ ప్రాక్టీస్‌ క్యాంప్‌లో పంత్‌..
కాగా ఐపీఎల్‌-2024 వేలానికి ముందు కోల్‌కతాలో 4 రోజుల ప్రాక్టీస్‌ క్యాంప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏర్పాటు చేసింది. ఈ ప్రాక్టీస్‌ క్యాంప్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ పాల్గోనున్నట్లు సమాచారం. పంత్‌ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ సన్నాహక క్యాంప్‌లో ఢిల్లీ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్, మెంటార్‌ సౌరవ్ గంగూలీ క్యాంపులో ఉన్నట్లు సమాచారం. రేవ్‌స్పోర్ట్స్‌ రిపోర్ట్‌ ప్రకారం.. రిషబ్‌ పంత్‌ ఒకట్రెండు ప్రాక్టీస్‌ గేమ్‌లు ఆడే అవకాశం ఉంది. కాగా గతేడాది డిసెంబర్‌ నుంచి క్రికెట్‌కు పంత్‌ దూరంగా ఉన్నాడు.
చదవండిWorld cup 2023: అత్యంత చెత్త రివ్యూ.. నవ్వు ఆపుకోలేకపోయిన కేన్‌ మామ! వీడియో వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top