
అయినా వెంటనే విడుదల
గతంలో ఏడాది శిక్ష అనుభవించిన క్రికెటర్
సిడ్నీ: గృహ హింస తదితర కేసుల్లో ఆ్రస్టేలియా మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అయితే అతను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జడ్జి తీర్పునిచ్చారు. గతంలో ఈ కేసులో స్లేటర్ ఏడాది పాటు పోలీసుల నిర్బంధంలోనే ఉన్నాడు. తాజా తీర్పు ప్రకారం అతని మిగిలిన మూడేళ్ల శిక్షను కూడా రద్దు చేశారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ఒక మహిళను వెంటపడి వేధించడంతో పాటు స్లేటర్ అసభ్యకర సందేశాలు కూడా పంపించాడు.
పోలీసు విచారణలో ఇవన్నీ వాస్తవమని తేలడంతో అతడిని జైలుకు పంపించారు. అయితే స్లేటర్ సుదీర్ఘ కాలం పాటు మద్యానికి బానిసై మానసిక సమస్యలతో బాధపడ్డాడని, ఇదే కారణంగా ఇలాంటి తప్పుడు పనికి పాల్పడ్డాడని అతని లాయర్లు వాదించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు సంబంధించి కూడా అతనిపై వేర్వేరు కేసులు ఉన్నాయి. జైలులో ఉన్న 375 రోజుల పాటు అతను సత్ప్రవర్తనతో మెలిగాడని వారు వివరించారు. దాంతో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటూ న్యాయమూర్తి 55 ఏళ్ల స్లేటర్ శిక్షను కుదించారు.
అయితే స్లేటర్ వచ్చే ఐదేళ్లపాటు ‘సస్పెండెడ్ పీరియడ్’లో ఉంటాడు. ఈ సమయంలో మళ్లీ ఏదైనా తప్పు చేస్తే మాత్రం తీవ్ర శిక్షకు గురవుతాడు. స్లేటర్ 1993–2001 మధ్య కాలంలో ఆ్రస్టేలియాకు 74 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 42.83 సగటుతో 5312 పరుగులు సాధించాడు. 14 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలతో అతను ఆసీస్ అప్రతిహత విజయాల్లో ఓపెనర్‌గా కీలకపాత్ర పోషించాడు. 42 వన్డేలు కూడా ఆడిన స్లేటర్ ప్రస్తుతం కామెంటేటర్‌గా స్థిరపడ్డాడు.