Mia Khalifa FIFA WC : పోర్చుగల్‌ ఓటమిని సెలబ్రేట్‌ చేసుకున్న మియా ఖలీఫా

Former Adult Film Star Mia Khalifa Celebrates Portugal Defeat Vs Morocco - Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పోర్చుగల్‌ కథ క్వార్టర్‌ ఫైనల్లో ముగిసింది. ఈసారి కచ్చితంగా కప్‌ కొడుతుందనుకున్న రొనాల్డో సేన అనూహ్యంగా మొరాకో చేతిలో ఓటమి పాలవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక రొనాల్డో అయితే తనకిదే చివరి మ్యాచ్‌ అన్నట్లుగా వెక్కివెక్కి ఏడ్చాడు. మరోవైపు ఆఫ్రికా దేశమైన మొరాకో ఫిఫా వరల్డ్‌కప్‌లో తొలిసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. 

పోర్చుగల్‌ ఓటమితో అభిమానులు నిరాశలో ఉంటే.. మాజీ పోర్న్‌ స్టార్‌, మోడల్‌ మియా ఖలీఫా మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. రొనాల్డో సేన క్వార్టర్స్‌లో ఇంటిబాట పట్టిన సందర్భంగా మొరాకోకు కంగ్రాట్స్‌ చెబుతూ ఆసక్తికర ట్వీట్‌ చేసింది. మొరాకో జెండాను పెట్టిన పక్కన ఆశ్చర్యార్థకం గుర్తులను పెట్టింది. ఆమె చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ప్రపంచ 9వ ర్యాంకర్‌ పోర్చుగల్‌ జట్టుతో శనివారం జరిగిన మూడో క్వార్టర్‌ ఫైనల్లో మొరాకో 1–0 గోల్‌ తేడాతో గెలిచింది.ఆట 42వ నిమిషంలో ఎడమ వైపు నుంచి అతియత్‌ అలా అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో యూసుఫ్‌ ఎన్‌ నెసిరి అమాంతం గాల్లోకి ఎగురుతూ ‘హెడర్‌’ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. దాంతో మొరాకో తొలి అర్ధభాగాన్ని 1–0తో ముగించింది.

రెండో అర్థభాగం చివరి 10 నిమిషాల్లో పోర్చుగల్‌కు గోల్‌ చేసేందుకు రెండుసార్లు అవకాశం వచ్చినా మొరాకో గోల్‌కీపర్‌ యాసిన్‌ బోనో వాటిని అడ్డుకున్నాడు. 90+1వ నిమిషంలో రొనాల్డో కొట్టిన షాట్‌ను యాసిన్‌ అద్భుతంగా నిలువరించాడు. ఇంజ్యూరీ టైమ్‌గా మ్యాచ్‌ను ఎనిమిది నిమిషాలు పొడిగించినా మొరాకో పట్టుదలతో ఆడి పోర్చుగల్‌కు గోల్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. తన కెరీర్‌లో లోటుగా ఉన్న ప్రపంచకప్‌ను ఈసారైనా అందుకోవాలని ఆశించిన రొనాల్డో చివరకు కన్నీళ్లపర్యంతమవుతూ భారంగా మైదానాన్ని వీడాడు.

చదవండి: FIFA: ఏ టైటిళ్లు, ట్రోఫీలు అక్కర్లేదు.. దేవుడు మాకిచ్చిన వరం.. కోహ్లి భావోద్వేగం

FIFA WC 2022: 'ఆ ఎక్స్‌ప్రెషన్‌ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top