
ప్యారిస్ ఒలింపిక్స్‌లో క్రీడాకారుల ప్రదర్శనతో పాటు లవ్ ప్రపోజల్స్ కూడా అందరని ఆకట్టుకుంటున్నాయి. ఈ విశ్వ క్రీడల వేదికగా మరో ప్రేమ జంట ప్రపంచానికి పరిచయమైంది. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఫ్రెంచ్ అథ్లెట్ అలిస్ ఫినోట్ తన ప్రియుడికి లవ్ ప్రపోజ్ చేసింది.
కాగా ఆలిస్ ఫినోట్ రేసు ప్రారంభానికి ముందు ఓ ఛాలెంజ్ చేసింది. ఈ రేసును తొమ్మిది నిమిషాలలోపు పూర్తి చేస్తే తన ప్రియుడికి అందరి ముందు తన ప్రేమను తెలియజేస్తానని స్నేహితులతో కండీషన్ పెట్టుకుంది. అయితే అనుకున్న విధంగానే 9 నిమిషాల్లో పరుగు పూర్తి చేసిన ఈ ఫ్రెంచ్ క్రీడాకారణి.. బహిరంగంగా తన బాయ్‌ఫ్రెండ్‌కు తన ప్రేమను తెలియజేసింది.
రేసును ముగించిన వెంటనే తన ప్రియుడు వద్దకు వెళ్లిన ఫినోట్.. ఉంగరాన్ని తీసి మోకాళ్లపై కూర్చోని లవ్ ప్రపోజ్ చేసింది. తన ప్రేయసి తనకోసం వేసిన ప్రపోజల్ ప్లాన్‌తో ఒక్కసారిగా సదరు బాయ్‌ఫ్రెండ్ ఆశ్చర్యపోయాడు.
ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 3000 మీటర్ల రేసును అలిస్ ఫినోట్ ఎనిమిది నిమిషాల 58.67 సెకన్లలో పూర్తి చేసింది. తద్వారా ఈ రేసును అత్యంత వేగంగా పూర్తి చేసిన తొలి యూరోపియన్‌గా ఆమె రికార్డులకెక్కింది.
కాగాఇంతకుముందు అర్జెంటీనా అథ్లెట్స్ సిమొనెట్, పిలర్ కంపోయ్.. చైనా బ్యాడ్మింటన్ జోడీ హువాంగ్ యా కియోంగ్ ,లీ యుచెన్ జోడీ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ వేదికగానే ఒక్కటయ్యారు.
French athlete came in fourth in the 3000m steeplechase, a European record, and asked for her boyfriend's hand ...pic.twitter.com/ofs9DocirE
— Figen (@TheFigen_) August 7, 2024