#RohitSharma: కెప్టెన్‌ అయ్యుండి బాధ్యతగా ఆడాల్సిన పని లేదా!

Fans Troll Rohit Sharma Batting Failure Continues-WTC Final Vs AUS - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లోనూ అంతగా ఆకట్టుకోని హిట్‌మ్యాన్‌ తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ అదే చెత్త బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో 15 పరుగులు చేసిన రోహిత్‌ పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 

అయితే ఇన్నింగ్స్‌ను కాస్త పాజిటివ్‌గానే ఆరంభించిన రోహిత్‌ అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక ఐసీసీ నాకౌట్స్‌లోనూ రోహిత్‌కు మంచి రికార్డు లేదు. ఇప్పటివరకు 12 సందర్భాల్లో ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడిన రోహిత్‌ రెండు సెంచరీలు మినహా మిగతా 10సార్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు.

కాగా రోహిత్‌ శర్మ పేలవ ఫామ్‌పై అభిమానులు మండిపడ్డారు. ''ఒక కెప్టెన్‌ అయ్యుండి బాధ్యతగా ఆడాల్సిన పని లేదా.. ఐసీసీ టైటిల్‌ కొట్టే చాన్స్‌ వచ్చింది.. సద్వినియోగం చేసుకోవాలి కాని చెడగొట్టొద్దు.. కెప్టెన్‌గా విఫలమయ్యావు.. ఫీల్డింగ్‌ చేయలేవు.. బ్యాటింగ్‌ చేయలేవు.. ఇంకెందుకు ఆడడం దండగ'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: సిరాజ్‌ అరుదైన ఘనత.. స్వదేశం కంటే విదేశాల్లోనే అదుర్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top