Dinesh Karthik: తొలి సారి భారత కెప్టెన్‌గా కార్తీక్‌.. అభిమాని ఏం చేశాడంటే..!

Fan Makes Portrait Of Dinesh Karthik With Rubik's Cube - Sakshi

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా కౌంటీ జట్టులతో రెండు వార్మాప్‌ మ్యాచ్‌లు ఆడింది. అయితే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలో భారత జట్టు కెప్టెన్‌గా వెటరన్‌ వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తీక్‌ వ్యవహరించాడు. అయితే తన కెరీర్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. అయితే ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాదించింది. ఈ క్రమంలో కార్తీక్‌పై పృథ్వీష్ అనే యువకుడు తనదైన శైలిలో అభిమానాన్ని చాటుకున్నాడు. మొజాయిక్ కళాకారుడైన పృథ్వీష్ 600 రూబిక్స్ క్యూబ్‌లను ఉపయోగించి కార్తీక్‌ చిత్రాన్ని రూపొందించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను పృత్వీష్ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. కొన్ని గంటల్లోనే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక భారీ పోర్ట్రెయిట్‌ రూపొందించిన పృత్వీష్‌పై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిస్తోంది. ఈ వీడియోపై కార్తీక్‌ కూడా స్పందించాడు. "బాగా తాయారు చేశావు పృథ్వీ , ఇది నన్ను బాగా అకట్టుకుంది" అని కార్తీక్‌ ట్వీట్‌ చేశాడు. ఇక మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన దినేష్‌ కార్తీక్‌ అదరగొడుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ కార్తీక్‌ అద్భుతంగా రాణించాడు.
చదవండి: కంటి చూపు సరిగా లేకున్నా.. క్రికెటర్‌గా క్లిక్‌ అయ్యాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top