టీమిండియాపై ఇంగ్లండ్‌ భారీ విజయం | England victory over Team India in T20 | Sakshi
Sakshi News home page

టీమిండియాపై ఇంగ్లండ్‌ భారీ విజయం

Jul 8 2026 1:19 AM | Updated on Jul 8 2026 8:44 AM

England victory over Team India in T20

నేడు ఇంగ్లండ్‌కు భారత్‌కు మధ్య జరిగిన మూడో టి20లో టీమిండియాపై 125 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల నష్టానికి 201 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్ (44 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) భారీ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మ‌రో ఓపెన‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ (21 బంతుల్లో 36) ప‌ర్వాలేద‌నిపించాడు. ఈ ఇద్ద‌రు తొలి వికెట్‌కు 43 ప‌రుగులో జోడించారు.  

ఆ త‌ర్వాత భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులేయ‌డంతో ఇంగ్లండ్ స్కోరు మంద‌గించింది. ఒక ద‌శ‌లో 160 నుంచి 170 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మవుతుందనుకున్న ఇంగ్లండ్‌.. చివ‌ర్లో సామ్ క‌ర‌న్ (24 బంతుల్లో 41 నాటౌట్‌), విల్ జాక్స్ (7 బంతుల్లో 14) మెరుపుల‌తో 200 ప‌రుగుల మార్క్‌ను దాటింది. భార‌త బౌల‌ర్ల‌లో హ‌ర్షిత్ రానా, ప్రిన్స్ యాద‌వ్ చెరో 2 వికెట్లు తీయ‌గా, అక్ష‌ర్ ప‌టేల్ ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

అనంతరం 202 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ బౌలర్ల దాటికి భారత భ్యాట్స్‌మెన్స్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. జోష్ టంగ్ నాలుగు వికెట్లు, జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్ రెండు, విల్ జాక్స్ ఒక వికెట్టు తీశారు. 



కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే టీమిండియా ఆలౌటైంది. భారత భ్యాట్స్‌మెన్స్‌లో వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ఇద్దరూ చెరో 13 పరుగులతో టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement